• District Collector D Murali Reddy said there were indications that the water level of the Godavari River, which was fed by floods, was gradually decreasing. At a press conference held at the Kakinada collector's office on flood relief centers on Sunday, the collector said there was a water level of 42.8 feet at Bhadrachalam on Sunday evening. He said this level could be reduced by midnight on Sunday. Similarly, 22 meters water level was reported at Polavaram and Dhavaleswaram Barrage,all the gates were lifted due to the flood and released 13.5 cusecs of water into the sea. Due to the floods, 32 villages in the Devipatnam zone and 133 villages in the Etapaka zone have been impacted by 36 villages in the Amalapuram division. About 18,809 people were identified as flood victims and taken to 85 rehabilitation centers. Four satellite phones are being used for information and 20 buses have been set up to move flood victims.

     

     

     

    వరదల మూలంగా పోటెత్తిన గోదావరి నది నీటి మట్టం క్రమేపీ తగ్గే సూచనలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ డి మురళి రెడ్డి తెలిపారు. ఆదివారం వరద పునరావాస కేంద్రాల పై కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం భద్రాచలం వద్ద 42.8 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఈ స్థాయి ఆదివారం అర్ధరాత్రి నాటికి తగ్గవచ్చునని అన్నారు. అదేవిధంగా పోలవరం వద్ద 22 మీటర్ నీటి మట్టం నమోదైందన్నారు వరద మూలంగా ధవళేశ్వరం బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తివేసి 13.5 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నామన్నారు. వరదల మూలంగా దేవీపట్నం మండలం 32 గ్రామాలు ఎటపాక మండలం 133 గ్రామాలు అమలాపురం డివిజన్లో 36 గ్రామాల్లో దీని ప్రభావం ఉందన్నారు. వరద బాధితులు గా 18 వేల 809 మంది గుర్తించి 85 పునరావాస కేంద్రాలకు తరలించారు ఏమన్నారు. సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి నాలుగు శాటిలైట్ ఫోన్లు వినియోగిస్తున్నామన్నారు వరద బాధితులను తరలించడానికి 20 బస్సులు ఏర్పాటు చేశామన్నారు.