• Tags
  • A Rally organized by the center on Dengue Disease Awareness was started by the Collector at Kakinada Municipal Corporation Kakinada Dairy Form. In view of seasonal diseases caused by the monsoon season in the district District Collector D. Muralidhar said people should be vigilant. On this occasion the Collector said that in some parts of the district malaria and dengue cases were reported,He said immediate steps were taken to curb the situation

    He mentined that few areas of the district have been reported with Dengue , steps are being taken to control.Previously reported areas of disease are identify as black spots and precautions are taken in those areas.Awareness programs for the people on these diseases has started.

    The Collector said that sanitation programs should be implemented in all the municipalities of the district and the gram panchayats.City Mayor Sunkara Pawani participated in the event and spoke on keeping the city clean and that people should be alert to diseases,She advises keeping the surroundings clean.

     

    జిల్లాలో వర్షాకాలం మూలంగా వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని జిల్లా కలక్టర్ డి.మురళీధర్
    రెడ్డి పిలువునిచ్చారు. కాకినాడ నగరపాలక సంస్ధ ఆధ్వర్యంలోడెంగ్యూ వ్యాధి అవగాహన పై శనివారం నాడు కాకినాడ డైరీ ఫారమ్సెంటర్ లో ఏర్పాటు చేసిన ర్యాలీని కలక్టర్ ప్రారంభించారు. 

    ఈసందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో మలేరియా, డెంగ్యూ వ్యాధులు నమోదైయ్యాయని వీటిని
    అరికట్టడానికి తక్షణ చర్యలు చెపట్టామని అన్నారు. జిల్లాలో మలేరియా, డెంగ్యూ ఉందని, డెంగ్యూ వ్యాధి ని కూడా పూర్తి
    స్ధాయిలో అదుపు చేయడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ మేరకు గతంలో వ్యాధులు నమోదైన ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి ఆ ప్రాంతాల్లోముందు జాగ్రత్తలు చేపడుతున్నారని, అదే విధంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని కలక్టర్ తెలిపారు.

    జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య కార్యక్రమాలు అమలు చేయాలని ఆదేశించినట్లు కలక్టర్
    తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ సుంకర పావని మాట్లాడుతూ నగరంలోని అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా వుంచాలని,అదే విధంగా వ్యక్తిగత పరిశుభ్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజలు వ్యాధుల పట్ల అప్రమత్తంగా వుండాలని,పరిసరాలను శుభ్రంగా వుంచాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా డైరీ ఫారమ్ సెంటర్ నుండి దుమ్ములపేట వరకు నిర్వహించిన ర్యాలీలో కలక్టర్, మేయర్, డిప్యూటీ మేయర్ కాళా సత్తిబాబు, మున్సిపల్ కమీషనర్ కె.రమేష్,నగర పాలక సంస్ధ సెక్రటరీ ప్రమోద్ కుమార్,ఎం.హెచ్.ఓ. డా.ప్రశాంత్, ఆదిత్య మహిళా కళాశాల విద్యార్ధీనిలు
    తదితరులు పాల్గొన్నారు .