• Tags
  • జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 14, 15, 16 తేదీల్లో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్‌ ఎంపికలు నిర్వహించ నున్నట్లు జిల్లా బ్యాడ్మింటన్‌ కార్యదర్శి చుండ్రు గోవిందరాజులు తెలిపారు. కాకినాడలోని బ్యాడ్మింటన్‌ అకాడమీలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. ఎంపికలు అండర్‌-13, 15, 17, 19 విభాగాల్లో సింగిల్స్‌, డబుల్స్‌లో ఉంటాయన్నారు. 50, 55, 60, 70 పురుష, మహిళా సింగిల్స్‌, డబుల్స్‌ నిర్వహించనున్నామన్నారు. బాలికలకు ఆఫీసర్స్‌ క్లబ్‌, బాలురకు కాకినాడ బ్యాడ్మింటన్‌ అకాడమీలో ఎంపికలు జరుగుతాయన్నారు. ఈనెల 12లోపు నమోదు చేసుకోవాలన్నారు. బ్యాడ్మింటన్‌ జిల్లాస్థాయి ఎంపికలు కాకినాడ బ్యాడ్మింటన్‌ అకాడమీ సౌజన్యంలో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వి.శ్రీనివాస్‌, కృష్ణంరాజు, ఫణిగోపాల్‌, కోచ్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.