• జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈరోజు నుంచి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్‌ ఎంపికలు ప్రారంభం అయ్యాయి. ఈనెల 16వ తేదీ వరకు వివిధ విభాగాల్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా  శ్రీమతి K.తనూజ (EGDBA), శ్రీ చుండ్రు గోవిందరాజు సెక్రటరీ (EGDBA) ముఖ్య అతిధులుగా విచ్చేసారు. ఈ ఎంపికలు అండర్‌-13, 15, 17, 19 విభాగాల్లో సింగిల్స్‌, డబుల్స్‌లో విభాగాల్లో నిర్వహిస్తున్నారు. 50, 55, 60, 70 పురుష, మహిళా సింగిల్స్‌, డబుల్స్‌ నిర్వహిస్తున్నారు. బాలికలకు ఆఫీసర్స్‌ క్లబ్‌, బాలురకు కాకినాడ బ్యాడ్మింటన్‌ అకాడమీలో ఎంపికలు జరుగున్నాయి. బ్యాడ్మింటన్‌ జిల్లాస్థాయి ఎంపికలు కాకినాడ బ్యాడ్మింటన్‌ అకాడమీ (KBA) సౌజన్యంతో నిర్వహిస్తున్నారు.