• All arrangements have been made by the District Administration to conduct the Farmers' Day at the constituency level on the 8th of this month. These ceremonies have been organized by the state government in accordance with the directives issued by the state government to hold these ceremonies from 10 am to 5 pm on Monday, in honor of the birthday of former chief minister of the state, Heavenly Dr YS Rajasekhara Reddy. Will be organized in categories. These ceremonies are being held in Rajarakonam constituency, Korukonda constituency in Gadarada, Rampachodoram constituency in Krishna Vidyalaya, Kandinamadura in Kakinada Rural constituency. The ceremonies commenced at 10 am with Jyoti Prasadna, the Hon'ble Chief Minister's message, keynote address, messages of dignity, special guests, interpretation of government novel schemes, farmers' views on cultural welfare and cultural programs. After the lunch break, scientists will be meeting with farmers, distributing awareness programs on agriculture and allied sector projects, honoring prosperous farmers, granting credit certificates to tenants, soil health cards, micro nutrients and subsidiary subsidies to farmers.

    జిల్లాలో ఈ నెల 8వ తేదీన నియోజకవర్గ స్థాయిలో రైతు దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. రైతుబాంధవుడు మాజీ ముఖ్యమంత్రి   స్వర్గీయ డా.వై.ఎస్.రాజశేఖర రెడ్డి జన్మదినం పురస్కరించి ఈ వేడుకలను వరకూ రాష్ట్ర స్థాయిలోను, నియోజక వర్గాల స్థాయిలోనూ సోమవారం ఉదయం 10 గం.ల నుండి సాయంత్రం 5 గం.ల వరకూ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల కనుగుణంగా ఈ కార్యక్రమాలను జిల్లాలోని 17 రూరల్ అసెంబ్లీ నియోజక వర్గాలలో నిర్వహించనున్నారు.  ఈ వేడుకలను రాజానగరం నియోజక వర్గంలో కోరుకొండ మండలం గాదరాడలోను, రంపచోడవరం నియోజక వర్గంలో కృషి విజ్ఞాన కేంద్రం, పందిరిమామిడిలోను, కాకినాడ రూరల్ నియోజక వర్గంలో కరప లోను, పి.గన్నవరం నియోజవర్గంలో వాడ్రేవుపల్లి లోను నిర్వహిస్తుండగా, మిగిలిన నియోజక వర్గాలలో ఆయా నియోజక వర్గ ప్రధాన కేంద్రాలలో నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గ.లకు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమయ్యే కార్యక్రమాల్లో  గౌరవ ముఖ్యమంత్రి సందేశం, ముఖ్య, విశిష్ట, గౌరవ, ప్రత్యేక అతిధుల సందేశాలు, ప్రభుత్వ నవరత్న పధకాలపై వివరణ, రైతు సంక్షేమ కార్యక్రమాలపై రైతుల అభిప్రాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భోజన విరామ అనంతరం రైతులతో శాస్త్రవేత్తల చర్చా గోష్టి, వ్యవసాయ, అనుబంధ శాఖల పధకాలపై అవగాహనా కార్యక్రమాలు, అభ్యుదయ రైతులకు సన్మానం, కౌలురైతులకు రుణ అర్హతపత్రాలు, రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు, సూక్ష్మ పోషకాలు, అనుబంధశాఖల రాయితీలు పంపిణీ చేస్తారు. ప్రధానంగా వైయస్ఆర్ రైతు భరోసా పధకం క్రింద పంటకాల ప్రారంభానికి మందే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు కుటుంబానికి  అందిస్తున్న  12,500 రూపాయల ఆర్థిక సహాయం, బ్యాంకుల ద్వారా రైతులకు 84 వేల కోట్ల పంటరుణాల పంపిణీ, రైతుల పంటలకు భీమా రక్షణ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న 2163 కోట్ల ప్రీమియం, రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు 3000 కోట్లతో  ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు గురించి రైతులకు వివరిస్తారు.  అలాగే ప్రమాదవశాన చనిపోయే రైతు కుటుంబాలకు వైఎస్ఆర్ భీమా ద్వారా 7 లక్షల ఆర్థిక సాయం, ఉచిత బోర్లు,  పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరా, యూనిట్ రూ.1-50లకే ఆక్వా రైతులకు విద్యుత్ సరఫరా, వ్యవసాయ మిషన్ ఏర్పాటు గురించి వివరించనున్నారు.    సాయంత్రం 5 గం.లకు వందన సమర్పణతో వేడుకలు ముగుస్తాయి. రైతు దినోత్సవ వేడుకల సందర్భంగా వేదికల వద్ద వ్యవసాయ, అనుబంధ శాఖలు, బ్యాంకులు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే అత్యాధునిక టెక్నాలజీ, యంత్రాల ఎగ్జిబిషన్లు, బెస్ట్ ప్రాక్టీసెస్ లైవ్ డెమోన్ ష్ట్ర్రేషన్లు ఏర్పాటు చేస్తున్నారు.  రైతు దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అన్ని శాఖల సమన్వయంతో జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటైంది. వేడుకల నిర్వహణకు ప్రతి నియోజక వర్గానికి లక్ష రూపాయలు నిధులు ప్రభుత్వం కేటాయించింది.   జిల్లా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ వేడుకలలో పాల్గొని రైతు సంక్షేమానికి, వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విధానాలను, నిర్ణయాలను వివరిస్తారు.                                                                                                                             (సమాచార శాఖచే జారీ)