• Tags
  • కాకినాడలోని జిల్లా క్రీడా మైదానం ఆడిటోరియంలో సాధన చేసే జిల్లా జిమ్నాస్టిక్స్‌ క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పోటీల్లో ప్రతిభచూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని కోచ్‌ ఎన్‌.సురేష్‌ చెప్పారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు బుధవారం జిల్లా క్రీడా మైదానంలో అభినందిస్తూ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 8న గుంటూరులోని బి.ఆర్‌. స్టేడియంలో జరిగిన సబ్‌ జూనియర్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన బాలురు విభాగం నుంచి పి.చంద్రస్వరూప్‌, పి.పార్థివ్‌, ఎం.అమిత్‌రత్న ఎంపికవ్వగా, బాలికల విభాగం నుంచి ఎస్‌.మౌనిక ప్రసన్న, డి.రూపా, పి.హేమహన్సికలు పాల్గొని జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. వీరంతా ఈనెల 28 నుంచి వడోదరా(గుజరాత్‌)లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.