You are here

Download Puraseva App from Playstore to pay Municipal Taxes Online

Download Puraseva App from Playstore to pay Municipal Taxes Online

 

 

 

 

 

కాకినాడ నగరపాలక సంస్థ “స్వచ్చ సర్వేక్షన్ 19”లో భాగముగా, నగరపాలక సంస్థ ద్వారా నగర ప్రజలకు అందించు అన్ని సేవలను నగరపాలక సంస్థ కార్యాలయమునకు ప్రజలు స్వయముగా వచ్చి తెలుసుకొనే ప్రయాస ను నగర ప్రజలుకు లేకుండా ఉండే విధముగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారు అభివృద్ధ చేసిన ఏప్ ద్వారా ఇంటి వద్దనే ఉండి నగరపాలక సంస్థ వారిచే అందించు అన్ని సేవలను వినియోగించుకొనే విధముగా “పుర సేవ” అను ఏప్ ను అన్ని ఆండరైడ్ మొబైల్ లలో డౌన్లోడ్ చేసుకో వలసినదిగా కోరుచూ అన్ని కళాశాలలు విద్యార్ధిని,విధ్యార్ధులను,అధ్యాపకులును ఈ కార్యక్రమములో భాగస్వాములు కావలసినదిగా నగరపాలక సంస్థ కమీషనర్ శ్రీ.కె.రమేష్ గారు కోరుచున్నారు.ఈ “పుర సేవ” యాప్ ను ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి దాని ద్వారా యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని తదుపరి మన వివరములను మీ మొబైల్ నందు రిజిష్టర్ చేసుకోవలెను. తదుపరి మీ యొక్క ఆన్ద్రయడ్ మొబైల్ నుండి నగరపాలక సంస్థ వారు అందించు అన్ని సేవలను వినియోగించుకోవచ్చును.ప్రస్తుతం మన కాకినాడ నగరం స్వచ్చ సర్వేక్షన్ 19 లో పోటీలో నిలబడుటకు మరియు భవిష్యత్తులో ప్రభుత్వం వారు ప్రకటించు ర్యాంకులలో మెరుగైన స్థానం సాదించుటకు ప్రజలు అందరు పుర సేవ యప్ ను డౌన్ లోడ్ చేసుకోనవలసియుండును. కావున నగర ప్రజలు అందరు ఈ యప్ ను డౌన్ లోడ్ చేసుకోవలసినదిగా నగర ప్రధమ పౌరురాలు మరియు మేయర్ శ్రీమతి సుంకర పావనితిరుమలకుమార్ గారు మరియు కమీషనర్ శ్రీ.కె.రమేష్ గార్లు కోరుచున్నారు.

Advertisement

Share this content.