You are here

Dr. B.R. Ambedkar's 128th Jayanthi Celebrations in Kakinada

Dr. B.R. Ambedkar's 128th Jayanthi Celebrations in Kakinada

 

 

 

 

 

 

భారత రాజ్యాంగాన్ని రూపొందించడం ద్వారా సమాజంలో అందరికీ సమాన హక్కులు కల్పించడానికి కృషి చేసిన మహానాయకుడు అంబేడ్కర్‌ అని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా కొనియాడారు. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని కాకినాడలోని ఇంద్రపాలెం వంతెన వద్ద గల ఆయన విగ్రహానికి ఆదివారం పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆశయ సాధనలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, వెనకబడిన కులాల అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు జీటీ పాండ్యా, హెచ్‌సీ మోడీ, సంయుక్త కలెక్టర్‌-2 సీహెచ్‌ సత్తిబాబు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ శోభారాణి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ కిషోర్, బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఎస్‌వీఎస్‌ సుబ్బలక్ష్మి, కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌ కె.రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ, జగన్నాథపురంలోని చర్చిస్క్వేర్‌ కూడలి వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ వసతిగృహంలో విద్యార్థులతో కలిసి కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అంబేడ్కర్‌ జయంతి వేడుక నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులు పాండ్యా, మోదీ సమక్షంలో విద్యార్థులతో కేకు కోయించారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలైన బాలలకు బహుమతులు అందజేశారు. కలెక్టరేట్‌ కోర్టు మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

Advertisement

Share this content.