You are here

అనపర్తిలో జన్మభూమి, శేషాద్రి ఎక్సప్రెస్ లకు హాల్ట్ కావాలి

News Desk - Kakinada9:

పార్లమెంటులో ఎంపీ మాగంటి మురళీమోహన్ ఇటీవల ప్రస్తావించిన రైల్వే సమస్యలపై రైల్వే డిఆర్ఎం ధనుంజయ స్పందించారు. నేడు తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి రైల్వే స్టేషన్ లోని సమస్యలను సమీక్షించేందుకు పర్యటించారు. ఒకవైపు రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుతూనే మరోవైపు సమస్యలు తిష్ట వేస్తున్నాయని ప్రతిరోజు తమకు ఫిర్యాదులు అందుతున్నాయని ఎంపీ మాగంటి మురళీమోహన్ డిఆర్ఎం దృష్టికి తీసుకొని వచ్చారు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని హామీ ఇచ్చారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అనపర్తి నుండి సుమారు 50 గ్రామాల ప్రజలు హైదరాబాద్, విజయవాడ, బెంగుళూరు, ఒరిస్సా వంటి ప్రాంతాలకు వెళ్లి వివిధ వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలిపారు. జన్మభూమి, శేషాద్రి ఎక్సప్రెస్ లకు హాల్ట్ కావాలని కోరారు. వంతెనలు నిర్మించాలని, డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు.  దాంతో పాటు 2,3 రైల్వే ప్లాట్ ఫామ్ లపై మరుగు దొడ్లు నిర్మించాలని కోరారు. స్టేషన్ భవనాన్ని నూతనంగా నిర్మిస్తామని DRM తెలిపారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, పలువురు రైల్వే ఉన్నత అధికారులు పాల్గొన్నారు. 

© Kakinada9.com 2018. All Rights Reserved

Advertisement

Share this content.