• ఓట్ల లెక్కింపునకు వారం రోజులు మాత్రమే గడువుంది.జిల్లాలో మూడు లోక్‌సభ.. 19 శాసనసభ స్థానాల్లో పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈనెల 23న కాకినాడలో జరగనుంది. కౌంటింగ్‌కు ముందురోజే జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి అటు అధికారులు, సిబ్బంది..ఇటు అన్ని పార్టీల నేతలు, వారి అనుయాయులు సన్నద్ధమవుతున్నారు.దీంతో కాకినాడలో వీరి వసతి ఏర్పాట్ల వ్యవహారం పెద్ద సమస్యగా మారింది. అధికారికంగా ఇప్పటికే ఈ ఏర్పాట్లు పూర్తి కాగా పార్టీలపరంగా ఎవరికి వారు తమతో వచ్చేవారి కోసం వసతి సౌకర్యానికి మల్లగుల్లాలు పడుతున్నారు. ఇందుకోసం ఆయా పార్టీల కార్యాలయాలనూ సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఎవరికి వారు అతిథి గృహాలు, హోటళ్లు, లాడ్జీల్లో గదులు రిజర్వ్‌ చేసుకున్నారు. దీంతో లెక్కింపు రోజు.. ఆ ముందు రోజు కాకినాడలోని వసతి గదులు కిటకిటలాడనున్నాయి. కాకినాడలో ఈనెల 23వ తేదీన ఓట్ల లెక్కింపును సజావుగా చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. జేఎన్‌టీయూకే, రంగరాయ వైద్య కళాశాల, జిల్లా క్రీడామైదాన ప్రాంగణం, ఐడియల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, నన్నయ వర్సిటీ పీజీ కేంద్రాల్లో ఇప్పటికే భద్రపరిచిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లను ఆరోజు లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమర్థంగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బుధవారం కౌంటింగ్‌ ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించారు.

    లెక్కింపుపై తర్ఫీదు..

    ఒప్పగొకే జిల్లాలో ముఖ్య అధికారులకు ఎన్నికల ఓట్ల లెక్కింపుపై రాష్ట్ర సచివాలయంలో ఓ విడత శిక్షణ జరిగింది. మళ్లీ ఈనెల 17న అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులకు రాజధానిలో ప్రత్యేక శిక్షణకు సన్నాహాలు చేస్తున్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో ఈనెల 14న కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్‌ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై వారికి అవగాహన కల్పించారు. లెక్కింపు కేంద్రంలో ఎదురయ్యే సమస్యలపై ముందస్తు అవగాహన కలిగేలా వీరికి శిక్షణ సాగింది. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా అధికారులకు లెక్కింపు తీరు విశ్లేషించడంతో పాటు నిబంధనలపై ప్రశ్నావళి ఇచ్చి వారి అవగాహన స్థాయిని అంచనా వేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కొన్ని చోట్ల ఏడు, మరికొన్ని చోట్ల 14 టేబుళ్లకు అక్కడ అనువుగా ఉన్న స్థలాన్ని బట్టి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్లకు ఒక టేబుల్‌ను కేటాయిస్తున్నారు. అన్ని నియోజకవర్గాలకు ఒకేలా 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తే ఫలితం త్వరగా వచ్చే అవకాశం ఉంటుందన్న సూచన కలెక్టర్‌ దృష్టికి వెళ్లింది. మరోవైపు పార్టీల పరంగా ఓట్ల లెక్కింపునకు హాజరయ్యే కౌంటింగ్‌ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమాలు సైతం జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో విజయంపై తెదేపా- వైకాపా- జనసేన పార్టీల అభ్యర్థులు, నేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తొలివిడతలో పోలింగ్‌ జరగడం, ఫలితాలకు 43 రోజులు నిరీక్షించాల్సి రావడం అభ్యర్థుల సహనానికి పరీక్షగా మారింది. ఓటరు తీర్పు వచ్చే వరకు ఆగలేక.. క్షేత్రస్థాయి పరిస్థితిపై స్పష్టమైన అంచనాలు లేకపోవడంతో ఎవరి కోణాల్లో వారు ప్రైవేటు బృందాలతో సర్వేలు చేయించుకున్నారు. ఇలా ఉండగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తప్పనిసరిగా అయిదు పోలింగ్‌ కేంద్రాల్లో వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించనుండటంతో ఈవీఎంలలో ఫలితం లెక్కతేలినా..అధికారిక ప్రకటన కోసం అభ్యర్థులు వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించే వరకు నిరీక్షించాల్సిందే.. లాటరీ పద్ధతిలో అసెంబ్లీకి అయిదు పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేసి ఈవీఎంలలో పోలైన ఓట్లకు..వీవీ ప్యాట్లలో నమోదైన ఓట్ల లెక్క తేలుస్తారు. ఈరెంటి మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదన్న తర్వాతే ఫలితాన్ని వెల్లడిస్తారు. ఒకవేళ ఈ రెంటి మధ్య తేడా ఉంటే మాత్రం పేచీ చోటుచేసుకునే అవకాశముంది.విజయం సాధించిన అభ్యర్థి మెజార్టీలో భారీ వ్యత్యాసం ఉన్నచోట్ల చిన్నచిన్న లోపాలపై అభ్యంతరాలు తలెత్తకపోయినా.. తక్కువ వ్యత్యాసం ఉండి.. అభ్యర్థులు నువ్వా- నేనా..? అన్నట్లు తలపడిన చోట ఏ మాత్రం తేడాలొచ్చినా ఫలితం వెల్లడించడంలో జాప్యం జరగనుంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను సమర్థంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.