You are here

Everything You Must know About Command Control Centre Kakinada

Everything You Must know About Command Control Centre Kakinada. Everything from One Place...Safety...Security...Towards Citizen Services...600 Cameras...652 Smart Lights...110 Sensors...12 Smart Polls...Pollution detection Sensors...Disaster Information Tools...Sophisticated Technology...94.89 Crores...

 

ccc1.jpg

 

అంతా ఒక్క చోటినుంచే...

సేఫ్టీ...సెక్యూరిటీ..టువర్డ్స్ సిటిజన్ సర్వీసెస్

600 కెమెరాలు... 652 స్మార్ట్ లైట్లు

110 సెన్సార్లు... 12స్మార్ట్ పోల్స్

కాలుష్య ఉద్గారాలను గుర్తించే సెన్సార్లు

విపత్తు సమాచారాన్ని తెలిపే సాధనాలు

అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన కమాండ్, కమ్యూనికేషన్ సెంటర్

94.89 కోట్లతో నిర్మాణం అవుతున్న సీసీసీ

ఈనెల 21 న ముఖ్యమంత్రిచే ప్రారంభం కానున్న సీసీసీ రాష్ట్రంలోనే మెట్టమొదటిసారిగా సీసీసీలో ప్రవేశపెడుతున్న లోరా టెక్నాలజీ

 

ccc2.jpg

 

భవిష్యత్తులో లోరా టెక్నాలజీతో నగరంలో మరిన్ని సేవలు

రక్షణగా నిలవడానికి సాధనం... భద్రత కల్పించే వ్యవస్థ... పర్యవేక్షించే పనితనం...పౌరసేవలు ... ఇంటర్నెట్ , వైఫై.. అన్నింటికీ ఒకటే గేట్ వే...కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్. స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా 94.89కోట్ల వ్యయంతో కాకినాడ వివేకానంద పార్క్ లో స్మార్ట్ సిటీ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ సిద్దమవుతుండగా సీసీసీ సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్, ఐఓటీ ప్లాట్ ఫామ్ ఇంటిగ్రేషన్, జీఐఎస్‌ ఇంటిగ్రేషన్ , ఈఆర్పీ ఇంటిగ్రేషన్ ల సహాయంతో కమాండ్, కమ్యూనికేషన్ సెంటర్ పనిచేయబోతోంది. రాష్ట్రంలో మొదటిసారిగా లోరా టెక్నాలజీని స్మార్ట్ సిటీ కమాండ్, కమ్యూనికేషన్ సెంటర్ లో ప్రవేశపెడుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ ను ఈనెల 21వతేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.

 

ccc9.jpg

 

అంతా అక్కడ నుంచే ...

పౌరసేవల్లో 15 విభాగాల పనిని కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ నుంచి చేసే విధంగా వ్యవస్థను రూపొందించారు. నగరాల్లో సర్విలెన్స్ కెమెరాల పాత్ర ఏమిటో గత కొన్ని సంవత్సరాలుగా ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరంలేదు.. భద్రత విషయంలో కానీ రక్షణ కల్పించడంలో కానీ సీసీకెమెరాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ప్రతీచోటా తప్పనిసరిగా సీసీకెమెరాలు ఆవశ్యకత ఏర్పడింది. ఇవి కేవలం పోలీసులు మాత్రమే ఉపయోగించుకునే వ్యవస్థగా ఉండేది. వీటికి వైర్ లెస్ టెక్నాలజీ లోరా (లో రేట్ లాంగ్ రేంజ్ కమ్యూనికేషన్ ) ను జతచేసి జీపీఎస్‌, సెన్సార్ల ద్వారా కాకినాడ స్మార్ట్ సిటీలో ఏర్పాటవుతున్న కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ పాత్ర ఒక్క పోలీసు విభాగానిది కాదు మొత్తం నగరపౌరుల సేవలన్నీ ఇక్కడినుంచే జరుగుతాయి. నాలుగు లక్షలమంది పౌరులున్న నగరాన్ని మొత్తం 600 నిఘా నేత్రాలతో చూడడం దగ్గర నుంచి ట్రాఫిక్ నియంత్రించడం, 652 విద్యుద్దీపాలను వెలిగించడం, సిబ్బంది చేసే పనిని సెన్సార్లు, జీపీఎస్ ద్వారా పర్యవేక్షించడం, సెన్సార్ల ద్వారా పార్కింగ్ సేవలు, నగరపౌరులకు ఇంటర్నెట్ వైఫై సేవలందించడమే కాదు నగర పౌరుల ఆరోగ్యాన్నిరక్షించే చర్యలు సీసీసీ చేయబోతోంది. కాలుష్య ఉద్గారాలు ఏస్థాయిలో నగరంలో ఉన్నాయో సెన్సార్ల ద్వారా అంచానా వేస్తూ ప్రజలకు తెలియచేయబోతోంది. విపత్తు సమాచారాన్ని పిడుగుల ఎప్పుడు పడతాయన్నది నగరపౌరులకు సీసీసీ సమాచారం ఇవ్వబోతోంది. అక్కడితో ఆగకుండా ఆస్తిపన్ను, నీటి పన్ను, విద్యుత్ బిల్లులు ఎవరు చెల్లిస్తున్నారు...? ఎవరు చెల్లించడం లేదు లాంటి సమాచార మే కాదు పురసేవలన్నీ సీసీసీ డ్యాష్ బోర్డ్ లో ఎప్పటికప్పుడు డిస్ ప్లే అయ్యే విధంగా ఏర్పాటుచేసారు. అంతా స్మార్ట్ ఫోన్ సహాయంతో నగరపౌరులు సేవలు వినియోగించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వివేకానంద పార్క్ లో ఉన్న కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ లో సీసీసీ సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్, ఐఓటీ ప్లాట్ ఫామ్ ఇంటిగ్రేషన్, జీఐఎస్‌ ఇంటిగ్రేషన్ , ఈఆర్పీ ఇంటిగ్రేషన్ ఆపరేషన్స్ గా పనిచేస్తున్నారు. విభాగాలుగా పనిచేస్తాయి. మొత్తండేటాను కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ లో స్టోర్ చేయడంతో పాటు కార్పొరేషన్ లో ఏర్పాటు చేసిన డేటా సెంటర్లో నే పదిలంగా ఉంచుతారు. అదే విధంగా కార్పొరేషన్ భవనంలోనే ఏర్పాటు చేసిన డేటా రికవరీ సెంటర్ లో డేటానుంచుతారు.

 

ccc3.jpg

కాలుష్యాన్ని తగ్గించడం .. ఆరోగ్యంగా ఉంచడం

స్మార్ట్ పోల్స్ కు ఏర్పాటు చేయబడిన 12 ఎన్విరాన్ మెంటల్ సెన్సార్ ద్వారా ఎప్పటికప్పుడు వెలువడుతున్న కాలుష్య ఉద్గారాల స్థాయిని సీసీసీ పర్యవేక్షిస్తుంది. వాహనాలు ఎక్కువగా తిరుగుతున్న ప్రాంతంలో కాలుష్య ఉద్గారాలు గుర్తించి అవి ఎక్కువగా విడుదలవుతున్నట్టు గుర్తిస్తే ప్రజలను అప్రమత్తం చేస్తారు. ఎయిర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్, కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ వంటివాయువులు ఎంతమేరకు వాహనాలనుంచి విడుదలవుతున్నాయి... గాలిలో ఏ మేరకు ఉంటున్నాయి అన్నసమాచారాన్ని అందిస్తారు. ఒకవేళ ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ విడుదలయినట్టయితే అక్కడ ట్రాఫిక్ ను మళ్లించడమో అక్కడి ప్రజలను అప్రమత్తం చేయడమో జరుగుతుంది. తద్వారా కాలుష్య ఉద్గారాల బారిన ప్రజలు పడకుండా చర్యలు తీసుకుంటారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సహాయంతో ఇదంతా చేస్తారు. దీంతో పాటు వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు తెలియచేస్తారు. నగరంలో ఏర్పాటు చేసిన 30 పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ లో వాతావరణ హెచ్చరికలను, విపత్తుల సమాచారాన్ని తెలియచేస్తారు. పిడుగుల పడబోయే సమాచారం నుంచి తుఫానులు, వర్షాల సమాచారం ఎప్పటికప్పుడు నగరంలో దాదాపుగా అన్ని కూడళ్లవద్ద వాయిస్ ద్వారా వినిపిస్తారు. అంతే కాకుండా నగరంలో ఏర్పాటు చేసిన వేరియబుల్ మెసేజింగ్ డిస్ ప్లే బోర్డులోనూ వాతావరణ హెచ్చరికలు తెలియచేస్తారు. దాంతో పాటు నగరానికి చెందిన వివిధ రకాల సమాచారమూ మెసెజ్ బోర్డులో డిస్ ప్లే చేస్తారు. తద్వారా నగరానికి వచ్చేకొత్తవారికి సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. వేరియబుల్ మెసేజింగ్ డిస్ ప్లేలు ఐదు ఏర్పాటు చేస్తున్నారు.

 

నగరమంతా వైఫైనే..

కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ అమలులోకి వస్తే నగరమంతా వైఫై ఉంటుందనడంలో అతిశయోక్తి కాదు. 170 పాయింట్లు ఇండోర్ వి కాగా 300 పాయింట్లు ఔట్ డోర్ వైఫై పాయింట్లను ఏర్పాటుచేస్తున్నారు. స్కూళ్లుండే ప్రాంతాలు, మార్కెట్లు , జంక్షన్ లు, ఆటస్థలాలు అన్నింటినీ కవర్ చేసారు. ఒక సారి లాగిన్ అయిన తరువాత అరగంట వైఫై వినియోగించుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తున్నారు కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ వారు.

ccc4.jpg

కెమెరా కంట పడ్డారో...

కమండ్ కమ్యూనికేషన్ సెంటర్ లో కెమెరా కన్నే కీలకం. నేరస్థుడిని సైతం పట్టేసే కెమెరాలను కాకినాడ నగరంలో ఏర్పాటు చేస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపిస్తే చాలు కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ లో ఉన్నవారు ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ ను వాడతారు. ముఖాన్ని జూమ్ చేసి గుర్తించే 10 ఎఫ్ఆర్ఎస్ కెమెరాలను ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేస్తున్నారు. దీని వలన నగరంలోకి వచ్చిపోయే నేరస్థుల ఆకకట్టబడుతుంది. అప్పటికే ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ లో నేరస్థుల డేటాతో పాటు వారి ఫోటోలను ఉంచుతారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తి నేరస్థుడిఫోటోతో మ్యాచ్ కాబడిఇకతే వెంటనే సమీప పోలీసులకు సీసీసీ సమాచారం అందచేస్తుంది. వెంటనే ఆ నేరస్థుడిని పట్టుకుంటారు. నగరంలో 350 సర్విలెన్స్ కెమెరాలకు అదనంగా ఈ కెమెరాలు పనిచేస్తాయి. వీటితో పాటు పోలీసులు నగరంలో వినియోగిస్తున్న 120 కెమెరాలను కమాండ్, కమ్యూనికేషన్ సెంటర్ వారు వినియోగించుకుంటారు. అంతే కాకుండా పోలీసులు మరికొన్ని కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తంగా భవిష్యత్తులో 600 కెమెరాల ద్వారా సీసీసీ నగరాన్ని పర్యవేక్షించబోతుంది. అంతే కాకుండా ఆటోమేటిక్ నంబర్ ప్లాట్ రికగ్నిషన్ ను కూడా సీసీసీ వాడబోతోంది. వాహనదారుడి నంబర్ ప్లేట్ అనుమానాస్పదంగా కనిపించినా నిబంధనలకు విరుద్దంగా నంబర్ ప్లేట్ ఉన్నా సీసీకెమెరాల్లో ఉన్న ఏఎన్‌పీఆర్‌ సిస్టమ్ క్షణాల్లో గుర్తిస్తుంది. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన వారే కాకుండా నేరస్థులను కూడా సులువుగా పట్టుకునే వీలుంటుంది. రెడ్ లైట్ నిబంధన ఉల్లంఘించినా దొరికిపోతారు. నగరంలో ఐదు ప్రధాన కూడళ్లలో రెడ్ లైట్ వయోలేషన్ డిటెక్ట్ చేసే విధంగా సిస్టమ్ తయారుచేసారు. దాంతో పాటే4 ప్రధాన కూడళ్లలో అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు.

 

పార్కింగూ స్మార్టే...

కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ అందుబాటులోకి వస్తే నగరంలో పార్కింగ్ కూడా స్మార్ట్ అవ్వబోతోంది. ప్రస్తుతానికి కొంతమేరకు పనిజరిగినా భవిష్యత్తులో స్మార్ట్ పార్కింగ్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. రెండు పెద్ద పార్కింగ్ స్థలాలతో పాటు మొత్తం వంద పార్కింగ్ ప్లేస్ లను స్మార్ట్ పార్కింగ్ గా చేస్తున్నారు. 55లక్షల రూపాయల వ్యయంతో స్మార్ట్ పార్కింగ్ ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ పార్కింగ్ స్థలంలో సెన్సార్ లుంటాయి. నగరపౌరుడు పార్కింగ్ చేసుకోవడానికి ముందే తన వాహనాన్ని పార్కింగ్ చేసుకునే స్థలాన్ని ముందే సిద్దం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంతా స్మార్ట్ ఫోన్ సహాయంతోనే. ఆన్ లైన్ లోనే పార్కింగ్ రుసుము చెల్లించి వాహనాన్ని పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. పార్కింగ్ స్థలాల్లో సిబ్బంది కూడా ఉండరు. ఎవరికి వారు ఎంచుకున్న స్థలంలో నేరుగా పార్కింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించబడుతుంది.

ccc5.jpg

పక్కాగా పారిశుధ్యం ...

నగరంలో పారిశుధ్యమే ప్రధానపాత్ర పోషిస్తోంది. ఏ మాత్రం పారిశుద్యం లోపించినా అధికారులు పౌరుల అగ్రహానికి గురవ్వాల్సిందే. అందుకే స్మార్ట్ సిటీ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ వ్యవస్థలోనూ పారిశుధ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు పౌరులకు తెలియచేసేలా చూడడంతో పాటు సిబ్బందిని అప్రమత్తం చేసేవిధంగా వ్యవస్థను రూపొందిస్తున్నారు. చెత్త ను ఎప్పుడు తీస్తున్నారు...? చెత్తను తీసుకువెళ్తున్న వాహనాలు ఎక్కడున్నాయి..? డస్ట్ బిన్ లో చెత్త తీసారా లేదా ఫుల్ అయినప్పుడు దాన్ని ఎక్కడికి తీసుకువెళ్లాలి అనేది సమాచారాన్ని సిబ్బందికి తెలియచేస్తారు. ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. నగరంలో 110 సెన్సార్ లను ఏర్పాటు చేశారు. ఎక్కడ చెత్త తీయకపోయినా సెన్సార్ సెకండ్లలో సమాచారాన్ని చేరవేస్తుంది. అంతే కాకుండా చెత్త సేకరించే 50వాహనాలకు ఆటోమేటిక్ వెహికల్ లొకేటర్ సిస్టమ్ లను ఏర్పాటు చేస్తున్నారు. అవి ఎప్పుడు ఎక్కడ ఉన్నాయి అనే విషయాన్ని ఖచ్చితంగా సీసీసీ లో ఉన్న అధికారులు తెలుసుకుంటారు. దీంతో పాటు ఐదుగురి తో పనిచేసే హెల్ప్ డెస్క్ నిరంతరం సేవలకు సంబంధించి పుర ప్రజల ఫిర్యాదులను తీసుకుంటారు. వాటిని పరిష్కారం చేసే దిశగా పనిచేస్తారు.

 

కావాల్సినంత కాంతి...

కావాల్సినంత వెలుగునివ్వడమేంటనుకుంటున్నారా.. స్మార్ట్ లైట్ కు ఆ ఆప్షన్ ఉంది. కావాల్సినంత వెలుగును సెట్ చేసుకోవడంద్వారా 85 శాతం విద్యుత్ ను ఆదాచేయబోతున్నారట. ఇంటెలిజెంట్ లైట్ పేరుతో ఉన్న స్మార్ట్ లైట్స్ కు సెన్సార్లు అమర్చబడి ఉంటాయి. ట్రాఫిక్ కు అనుగుణంగా, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రిమోట్ ద్వారా సీసీసీ నుంచే స్మార్ట్ లైట్ కాంతిని తగ్గిస్తూ పెంచుతూ ఉంటారు. ఒకే కాంతినుంచడం కంటే కాంతిని తగ్గిస్తూ పెంచడం వలన విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి దోహదపడుతోందట. నగరంలో 652 స్మార్ట్ లైట్లు ఉంటే ప్రతీ లైటుకు సెన్సార్ ఉంటుంది.

 

ccc7.jpg

ఎమర్జెన్సీ కాల్ బాక్స్ ..

అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు రక్షించబడాలంటే పోలీసులకు 100 డయల్ ద్వారా సమాచారం ఇస్తాము. కానీ అది చేయలేని పరిస్థితిలో కూడా కాకినాడ కార్పొరేషన్ లో కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ సొల్యూషనన్ ఇస్తోంది. మహిళ కానీ, పురుషులు కానీ అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కాల్ బాక్స్ ను వాడొచ్చు. సోలార్ పవర్ తో ఎమర్జెన్సీ కాల్ బాక్స్ లు పనిచేస్తాయి. నగరంలో 25 చోట్ల ఏర్పాటుచేయబడిన ఈసీబీ లలో ఉండే రెడ్ బటన్ నొక్కితే నేరుగా సీసీసీకి కాల్ వెళ్తుంది. బాధితుడు లేదా బాధితురాలు ఉన్న పరిస్థితిని సీసీసీ రూంలో అధికారులు వీడియో ద్వారా చూడగలుగుతారు. అక్కడ ఫోన్ ద్వారా అతని బాధను వినగలుగుతారు. వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు సమాచారం అందించి బాధితుడిని రక్షించే ప్రయత్నం చేస్తారు. లోరా టెక్నాలజీ మరిన్ని సేవలు వినియోగంలోకి... విదేశాల్లో అత్యంత శక్తివంతమైన వ్యవస్థగా లోరాటెక్నాలజీ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ పనిచేస్తుండగా 2017లో మొదటి సారిగా జెంలోషెడ్ పూర్ లో ఏర్పాటు చేశారు. అక్కడ విజయవంతంగా పనిచేసింది. ఆ తరువాత టాటా కమ్యూనికేషన్స్ పలు ప్రాంతాల్లో ఫైలట్ ప్రాజెక్ట్ గా లారా టెక్నాలజీని వినియోగంలోకి తీసుకువచ్చినా స్మార్ట్ సిటీలో లోరా టెక్నాలజీ వాడినా రాష్ట్రంలో కాకినాడలోనే ప్రధమం. తిరుపతి, విశాఖపట్నంలలో సైతం లోరా టెక్నాలజీతోనే కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువ సేవలను ఇంటర్నెట్ ద్వారా వినియోగంలోకి తీసుకోవాలంటే వైర్ లెస్ టెక్నాలజీ ( ఇంటర్నెట్ ఆఫ్‌ థింగ్స్ ) అవసరం. అదే లోరా టెక్నాలజీ. లో రేట్ లాంగ్ రేంజ్ గా ఉండే లోరా రేడియో టెక్నాలజీ లాంటిది. స్పెక్ట్రమ్ లో ఒక భాగంగా ఉండే లోరా తక్కువ ఎలక్ట్రోమాగ్నటిక్ అంతరాల్లో ఉంటుంది. సిగ్నల్స్ ను ఎక్కువ దూరాలకు పంపిస్తుంది. లోరా టెక్నాలజీ ద్వారా దాదాపు 20 కిలోమీటర్లవరకు సిగ్నల్స్ పనిచేస్తాయి. పారిస్ లో మొదటి సారిగా ఏర్పాటు చేసిన లోరా టెక్నాలజీ తరువాత అనేక నగరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో జంషెడ్ పూర్ తరువాత కాకినాడలోనే లోరా పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తోంది. కాకినాడ నగరంలో 11 బీటీఎస్‌ ( బేస్ ట్రాన్స్ రిసీవర్ స్టేషన్ల) ను ఏర్పాటు చేస్తున్నారు. స్మార్ట్ పోల్స్ కు హోస్ట్ లోరా బీటీఎస్‌లు, ఎన్విరాన్ మెంట్ సెన్సార్ లను ఏర్పాటు చేస్తారు. పీఏ సిస్టమ్, వైఫై ఎక్విప్ మెంట్ ను ప్రతీ స్మార్ స్థంభానికి 15 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేస్తారు. స్మార్ట్ లైట్ సెన్సారర్లను కూడా స్థంబాలకు ఏర్పాటు చేశారు. నగరంలో అలాంటివి పన్నెండు స్మార్ట్ పోల్స్ ( స్థంభాలు) ఉన్నాయి. అందుకు సంబంధించిన వర్క్ ఇప్పటివరకు 40శాతం పూర్తయ్యింది.

 

ccc8.jpg

 

సిటీ బ్యాక్ బోన్

కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ పనిచేయాలంటే సిటీ బ్యాక్ బోన్ నెట్ వర్క్ ప్రధానం. సీసీటీవీల దగ్గరనుంచి వైఫ్ పనిచేయడం వరకు సీసీబోన్ నెట్ వర్క్ కీలకం. 120 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్, 4 ప్రధాన రూటర్లు, 24 అనుబంధ రూటర్లు లను ఏర్పాటు చేసారు.

 

పౌర సేవల్లో సీసీసీ కీలక పాత్ర పోషిస్తుంది...

స్మార్ట్ సిటీలో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్, కమ్యూనికేషన్ సెంటర్ వ్యవస్థ నగరపౌరుల సేవల్లో కీలక పాత్ర పోషిస్తుంది. నగరంలో ఏర్పాటు చేస్తున్న 600 సీసీకెమెరాల ద్వారా ప్రజలకు భద్రత కల్పించడంతో పాటు కమాండ్, కమ్యూనికేషన్‌ సెంటర్ ద్వారా చేస్తున్న సేవలు నగరపౌరులకు సంత్రుప్తినిస్తాయి. పౌరసేవలన్నీ ఎప్పటికప్పుడు ప్రతీక్షణమూ పర్యవేక్షణచేయడం ద్వారా పనులు త్వరగా జరగడంతో పాటు ఎకౌంటబులిటీ ఉంటుంది.

- కార్తికేయ మిశ్రా, జిల్లాకలెక్టర్

Advertisement

Share this content.