You are here

Exhibition Inaugurated by Mayor Pavani at McLaurin High School Grounds Kakinada

Exhibition Inaugurated by Mayor Sunkara Pavani at McLaurin High School Grounds Kakinada

 

 

 

 

 

 

43వ పారిశ్రామిక, వ్యవసాయ, ఫల, పుష్ప ప్రదర్శన ఆహ్లాద వాతావరణంలో ఆనందంగా గడపడానికి ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు దీని వినియోగించుకోవాలని కాకినాడ నగర పాలక సంస్థ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ కోరారు.

 

 

నేడు హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన 43వ పారిశ్రామిక, ఫల, పుష్ప ప్రదర్శనను మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో సందర్శకులు ఉత్సాహంగా గడపడానికి రక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద ప్రదర్శనలు, జైంట్ వీల్, చెక్క బావిలో కార్లు, మోటార్ సైకిల్ సర్కస్, జైపూర్ బెడ్ షీట్స్, ఫ్యాన్సీ జ్యువెలరీ, పిల్లల ఆట వస్తువులు, తినుబండారాలు తదితర స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

అన్నవరం దేవస్థానం వారు ఏర్పాటు చేసిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమమని ఆమె తెలిపారు. ఈ ప్రదర్శన ఈనెల 5వ తేదీ నుండి 31వ తేదీ వరకు సాయంత్రం 4:30 గంటల నుండి 9:30 గంటల వరకు ఉంటుందన్నారు.

 

 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కె.రమేష్, అడిషనల్ కమిషనర్ సత్యవాణి 36వ డివిజన్ కార్పొరేటర్ ఎస్.లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు

Advertisement

Share this content.