You are here

Facilities Should Provide at All Polling Centres - Collector

Facilities Should Provide at Polling Centres said collector Kartikeya Mishra in a meeting with All ERO's, AERO's, DPO, PD DWMA, DLPO's, Concerned MC's, DC's at Vidhana Gowthami Hall Kakinada.

 

 

 

 

జిల్లాలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో డిసెంబరు చివరినాటికి కనీస సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పించాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ విధాన గౌతమి సమావేశ మందిరంలో ఆయన ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌, అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఫర్నీచర్‌, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు, ర్యాంపులు, ప్రహరీ ఉండాలన్నారు. ఈఆర్‌వో, ఏఈఆర్‌వోలు అన్ని పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి చేపట్టాల్సిన సౌకర్యాలను గుర్తించాలన్నారు. ఈ కేంద్రాలకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం ఉండాలని, ఇంటర్నెట్‌, మొబైల్‌ కనెక్టివిటీ తప్పనిసరిగా ఉండాలన్నారు. జిల్లాలో 1,267 పోలింగ్‌ కేంద్రాలకు ప్రహరీలు నిర్మిస్తున్నామని, వచ్చే ఫిబ్రవరి నాటికి మిగిలిన కేంద్రాలకు వీటి నిర్మాణం పూర్తి చేయాలని ఎస్‌ఎస్‌ఏ పీవో శేషగిరిని ఆయన ఆదేశించారు. రంపచోడవరం, రాజోలు, రాజానగరం, గన్నవరం, ముమ్మిడివరం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేని పోలింగ్‌ కేంద్రాలకు డాంగిల్‌ పరికరాలతో ఈ సదుపాయాన్ని కల్పించాలన్నారు. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకునేలా మార్గసూచన బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ-2018 ప్రక్రియలో వచ్చిన దరఖాస్తులపై విచారణ పూర్తిచేసి, ఈనెల 30 నాటికి పరిష్కరించాలని ఆదేశించారు. అనుమానాస్పద ఓట్ల పరిశీలన ప్రక్రియలో పూర్తి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇటువంటి ఓటర్ల సంతకాలు తీసుకోవాలన్నారు. సమగ్ర పరిశీలన చేయకుండా ఇటువంటి ఓట్లను తొలగించద్దని ఆదేశించారు. ప్రతి రాజకీయ పార్టీ అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో తమన ఏజెంట్లను నియమించుకునేలా చూడాలన్నారు. ఓటర్ల జాబితాలకు సంబంధించిన అంశాలను ఈఆర్‌వో నెట్‌లో అప్‌లోడ్‌ చేయటానికి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సర్వర్‌ ఏర్పాటు చేశారని, ఇది వేగవంతంగా పనిచేస్తోందని, వినియోగించాలని సూచించారు. ఎన్నికల కమిషన్‌ జిల్లాకు పంపిన వీవీ పాట్‌లను రాజకీయ పార్టీ సమక్షంలో ఈవీఎం గోదాములో భద్రపర్చాలని జిల్లా రెవెన్యూ అధికారి సుబ్బలక్ష్మి, కాకినాడ ఆర్డీవో రఘుబాబును కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో జేసీ మల్లికార్జున, జేసీ-2 సీహెచ్‌ సత్తిబాబు, సబ్‌ కలెక్టర్లు వినోద్‌కుమార్‌, సాయికాంత్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Share this content.