You are here

Free Training for Unemployed Youth Under Kaushal Godavari - Vikasa

Free Training for Unemployed Youth Under Kaushal Godavari - Vikasa

 

 

 

 

 

 

 

కౌశల్‌ గోదావరి - వికాస ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వికాస పీడీ వీఎన్‌ రావు తెలిపారు. ఇండస్ట్రియల్‌ ప్లంబర్‌, ఆఫీసు అసిస్టెంట్‌, ఫొటోషాప్‌, కమ్యూనికేషన్స్‌ స్కిల్స్‌ అండ్‌ టాలీ, జీఎస్టీ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఇండస్ట్రియల్‌ ప్లంబర్‌ శిక్షణకు పదో తరగతి, ఇంటర్‌ ఉత్తీర్ణులైన 27 ఏళ్లలోపు పురుష అభ్యర్థులు, ఆఫీస్‌ అసిస్టెంట్‌ శిక్షణకు ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులైన 26 ఏళ్లలోపు అభ్యర్థులు, ఫొటోషాప్‌ శిక్షణకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన 28 ఏళ్లలోపు అభ్యర్థులు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ శిక్షణకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన 26 ఏళ్లలోపు అభ్యర్థులు, జీఎస్టీ కోర్సుకు ఇంటర్‌(ఎంఈసీ, సీఈసీ), బికాం, బీబీఎం, ఎంబీఏ ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 8వ తేదీన కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయం వద్ద ఉదయం 9 గంటలకు విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు 0884-2352767 ఫోను నంబరులో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Share this content.