• ప్రాథమిక పాఠశాల స్థాయిలో విద్యార్థులకు గణితంపై ఆసక్తి పెంపొందించేందుకు ప్రభుత్వ అమలు చేయనున్న ‘గణిత వికాసం’ కార్యక్రమంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్‌ఎస్‌ఏ పీవో బి.విజయభాస్కర్‌ తెలిపారు. 2019-20 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పాఠశాలల్లో అబాకస్‌ ద్వారా సులభంగా లెక్కలు నేర్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దుతారని పీవో తెలిపారు. ఇందుకు సంబంధించి మొదటి, రెండో బ్యాచ్‌లకు ఈనెల 17 నుంచి 19 వరకూ రాజమహేంద్రవరం, కాకినాడలలో అర్బన్‌ డీఐ కార్యాలయాల్లో శిక్షణ ఇస్తారన్నారు. మూడో బ్యాచ్‌కు 20 నుంచి 22 వరకూ రంపచోడవరంలోని పీఎంఆర్‌సీలో, నాలుగో బ్యాచ్‌కు ఈనెల 24 నుంచి 26 వరకూ కాకినాడ డీఐ కార్యాలయంలో, అయిదో బ్యాచ్‌కు 27 నుంచి 29 వరకూ అమలాపురం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శిక్షణ ఇస్తారని తెలిపారు. ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన 285 మంది ఉపాధ్యాయులకు అబాకస్‌ కిట్లను అందించి శిక్షణ ఇస్తారని పీవో వివరించారు.