• Location
    Salipeta, Kakinada
  • Tags
  • జాతీయ క్రీడ హాకీలో రాణించాలంటే ఆసక్తి, కృషి, పట్టుదల ఉండాలని ప్రముఖ న్యాయవాది ప్రభాకర్‌ తెలిపారు. ఆదివారం కాకినాడలోని సాలిపేటలో ఉన్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉన్నత పాఠశాలలో హాకీ వేసవి ఉచిత శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. విద్యార్థులంతా వేసవిలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రీడాకారులకు తమ వంతు సహకారాన్ని అందిస్తామన్నారు. జిల్లా నుంచి ఎంపికైన క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వడమే కాకుండా, రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌ షిప్‌ సాధించారని హాకీ శిక్షకుడు పి.రవిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది కుసుమ సత్యనారాయణ, జిల్లా హాకీ సంఘం సంయుక్త కార్యదర్శి కె.ఎల్‌.నాగమణి, కోశాధికారి పి.సత్యగౌరీ, కోచ్‌ పి.నాగేంద్రకుమార్‌, సీనియర్‌ క్రీడాకారిణులు పాల్గొన్నారు.