• రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కురసాల కన్నబాబు ఈ నెల 15న తొలిసారిగా జిల్లాకు రానున్నారని మంత్రి కార్యాలయ సిబ్బంది గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు కాకినాడ గ్రామీణంలోని తిమ్మాపురంలో అచ్చంపేట కూడలి నుంచి ర్యాలీ నిర్వహించి స్వాగతం పలకనున్నారన్నారు.