You are here

Hon'ble Vice President of India M.Venkaiah Naidu Participated in Ramcosa Golden Jubilee Celebrations at Kakinada

Hon'ble Vice President of India M.Venkaiah Naidu Participated in Ramcosa Golden Jubilee Celebrations at Kakinada.

 

 

 

 

 

 

 

కాకినాడ రంగరాయ వైద్య కళాశాల మరియు పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవాల్లో పాల్గొనడానికి నేడు కాకినాడ కు విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి డా.యం. వెంకయ్య నాయుడును వాకలపూడి ఓఎన్జీసీ హెలిప్యాడ్ వద్ద పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక వైమానిక దళ హెలికాప్టర్లో విచ్చేసిన ఉపరాష్ట్రపతికి హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రూరల్ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి, కాకినాడ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పి విశాల్ గున్నీ, కాకినాడ మున్సిపల్ కమిషనర్ కె .రమేష్, రెడ్ క్రాస్ చైర్మన్ వై .డి రామారావు, కాకినాడ ఆర్ డి వో జి. రాజకుమారి, సమాచార శాఖ ఉపసంచాలకులు ఎం. ఫ్రాన్సిస్, మాజీ శాసనసభ్యులు అయ్యాజి వేమ, బిజెపి జిల్లా అధ్యక్షులు మాలకొండయ్య, బిజెపి నాయకులు చినబాబు తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అధికారులను,  ప్రజాప్రతినిధులను ఆప్యాయంగా పలకరించారు.

 

 

 

 

సమాజ హితమే పరమావధిగా గ్రామీణ పేద ప్రజలకు అందుబాటులో మెరుగైన సేవలు అందించాలని భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు వైద్యులను కోరారు.
నేడు ఉదయం స్థానిక రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కళాశాల వజ్రోత్సవం, కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం రామ్ కోస స్వర్ణోత్సవ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ మానవాళి మనుగడకు విద్య, వైద్యం అతి ముఖ్యమైన అవసరాలని వీటి ప్రోత్సాహ చొరవ చూపి రంగరాయ వైద్య కళాశాల స్థాపనకు కృషిచేసిన డా. ఎం వి కృష్ణారావు, కల్నల్.డి.యస్.రాజు, పిఠాపురం మహారాజా లను, ఆర్థిక సహాయం అందించిన దాతలను స్మరిస్తూ వారి వారసులను వజ్రోత్సవం సందర్భంగా సత్కరించడం మరింత మందికి స్పూర్తి ఇస్తుందన్నారు. పూర్వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఆర్ ఎం సి భవనాన్ని ప్రారంభించడం, ప్రఖ్యాత శాస్త్రవేత్త జేబీఎస్ ఆస్టిన్ తమ పార్థివదేహాన్ని పరిశోధనల నిమిత్తం కళాశాల పాథాలజీ విభాగానికి అందించడం అపూర్వ ఘట్టాలని ఘన చారిత్రక నేపథ్యంతో కళాశాల వైద్య విద్యలో నాణ్యత నూతన ప్రమాణాలతో ఎన్నో గ్రాడ్యుయేట్ పిజీ సూపర్ స్పెషాలిటీ కోర్సులతో ముందుకు సాగడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రతి పని ప్రభుత్వమే చేయాలనే ఆలోచనను ప్రజలు విడనాడి సమాజ అభివృద్ధికి తన వంతు బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని పరిసరాలను పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు. అలానే కళాశాల అభివృద్ధికి సేవలందించిన సుందర శివరావు విగ్రహాన్ని, ఆర్ ఎం సి, రామ్ కోస, జిల్లా రెడ్క్రాస్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఉపరాష్ట్రపతి కాకినాడ పర్యటన అనంతరం ఓఎన్జిసి హెలిప్యాడ్ వద్ద ఉప ముఖ్యమంత్రి ఎన్. చినరాజప్ప కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్నీ తదితరులు వీడ్కోలు పలికారు. ఉప రాష్ట్రపతి పర్యటన సందర్భంగా కాకినాడలో వాకలపూడి - అచ్చంపేట జంక్షన్ మీదుగా రంగరాయ వైద్య కళాశాల వరకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

Advertisement

Share this content.