You are here

Honourable Vice President of India Sri M.Venkaiah Naidu will Tour Kakinada in this Month

Honourable Vice President of India M.Venkaiah Naidu will Tour Kakinada in this Month.

 

 

 

 

 

 

 

 

ఈ నెల 5వ తేదీన గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు కాకినాడ నగరంలో జరగనున్న పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. నేడు రాత్రి కలెక్టరేట్ కోర్టు హాల్లో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా జిల్లా అధికారులు, రంకోసా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఈ నెల 5వ తేదీన భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప రాష్ట్రపతి ఈ నెల 5వ తేదీ ఉదయం 09.30 గం|| లకు కాకినాడ చేరుకొని అక్కడ నుండి రంగరాయ వైద్య కళాశాల చేరుకొని 11:15 గంటల వరకు కళాశాల స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొంటారని తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా ఉపరాష్ట్రపతికి అధికారికమైన అన్ని మర్యాదలు, లాంచనాలు విధిగా పాటించాలని పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశం లో రాంకోస అధ్యక్షులు డా.జి.శేషగిరి రావు, అర్ఎంసి  ప్రిన్సిపల్ డా.ఆర్. మహాలక్ష్మి, జాయింట్ కలెక్టర్-2 సిహెచ్. సత్తిబాబు, డిఆర్వో ఎస్.వి ఎస్. సుబ్బలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Share this content.