• ఈనెల 22వ తేదీ శనివారం నాడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత దినం పాటించాలని కార్యాలయాలను శుభ్ర పరచాలని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచాలని జిల్లాస్థాయి డివిజన్ స్థాయి మండలస్థాయి గ్రామస్థాయి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో శనివారం నాడు పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ ఆదేశించారు.