• ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లాలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు మొత్తం 16,392 మంది రాయగా, వారిలో 5,238 మంది(43.40 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వృత్తి విద్యా కోర్సుల్లో 1,944 మందికి 1030 మంది(49.92 శాతం) ఉత్తీర్ణత సాధించగలిగారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 13,515 మంది విద్యార్థులు హాజరుకాగా 6,548 మంది(54.21శాతం) ఉత్తీర్ణత సాధించారు. వృత్తి విద్యా కోర్సుల్లో 1,037 మంది పరీక్షలు రాయగా 521 మంది పాసై 62.98 ఉత్తీర్ణత శాతం నమోదు చేశారని అధికారులు తెలిపారు.