You are here

International Day of People with Disability Celebrations

International Day of People with Disability Celebrations

 

 

 

 

దివ్యాంగుల్లోని ప్రతిభను వెలికితీసి వారి నైపుణ్యాన్ని మెరుగుపెడితే అన్ని రంగాల్లో రాణిస్తారని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జేఎన్‌టీయూకేలోని అలుమ్ని ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హాజరయ్యారు. ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తుందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి 50 శాతం రాయితీతో రూ.లక్ష రుణం అందజేస్తున్నట్లు తెలిపారు. కాకినాడ నగరం ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు వివిధ క్రీడల్లో చక్కని ప్రతిభ కనబరిచారన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జిల్లా స్థాయిలో వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో జేసీ-2 సిహెచ్‌.సత్తిబాబు, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కేవీవీ సత్యన్నారాయణ, ఎస్‌ఎస్‌ఏ పీవో శేషగిరి, నగర డిప్యూటీ మేయర్‌ సత్తిబాబు, అఖిల భారత వికలాంగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్యాలరావు పాల్గొన్నారు.

Advertisement

Share this content.