You are here

Interviews Conducted for Granting Loans

Interviews Conducted for Granting Loans

 

 

 

 

.

 

జాతీయ షెడ్యూల్డు కులాల సహకార సంఘం(ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ) పథకం కింద స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పుకునేందుకు మంగళవారం డివిజన్ల వారీ ముఖాముఖిలు (ఇంటర్వ్యూలు) ప్రారంభించారు. తొలిరోజు కాకినాడ డివిజన్‌కు సంబంధించి 442 మంది దరఖాస్తుదారులకు ముఖాముఖిలు నిర్వహించారు. వారి అసలు ధ్రువీకరణలు, ప్రాజెక్టు నివేదికలను పరిశీలించారు. రూ.3 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు యూనిట్లు అందజేయనున్నారు. గతంలో ఈ పథకంలో రవాణా రంగం(ట్రాన్స్‌పోర్టు సెక్టార్‌) కింద కార్లు, ఇతర వాహనాల మంజూరుకు ముఖాముఖిలు నిర్వహించిన విషయం తెల్సిందే. ఇప్పుడు సెంట్రింగ్‌, టెంట్‌ హౌస్‌, ఫొటో స్టూడియో, డెయిరీ, కాంక్రీటు మిక్సర్లు, ప్రొక్లెయినర్లు, తదితర విభాగాల కింద యూనిట్ల మంజూరు నిమిత్తం ముఖాముఖిలు నిర్వహిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ వి.డేవిడ్‌రాజు స్వీయ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. బుధవారం పెద్దాపురం డివిజన్‌కు, గురు, శుక్రవారాలు అమలాపురం, రామచంద్రపురం డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు ముఖాముఖిలు నిర్వహిస్తామని డేవిడ్‌రాజు తెలిపారు. అన్ని డివిజన్లకు సంబంధించి 1,868 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

Share this content.