•  

    Joint Collector-2 G.Rajakumari has instructed the concerned officials to identify state lands in the district as the state government has decided to give 25 lakhs of houses to the homeless. On Saturday, the Kakinada Collectorate, along with the municipal commissioner, housing and tidco officials, reviewed the land area of ​​public lands. On this occasion, JC-2  G. Rajakumari said that Devaadaya, APIC and Irrigation lands in the district should be identified and submitted to the collectorate. The Department  will provide details of where the land will be bought and given to the beneficiaries. The zonal level inspectors should be gathering land details together with the inspectors.She added that 1.40 lakh beneficiaries in urban areas should acquire 300 acres of land. It is suggested to collect lands in the municipality for the septic tank project in the districts. The petitions and grievances in SPANDANA  should be resolved in terms of quality. The commissioner suggested that the quality of mid-day meals in municipal schools should be monitored.

     

     

    రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని పేదవారికి రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి నిర్ణయించినందున జిల్లాలో ప్రభుత్వ భూములు గుర్తించాలని జాయింట్ కలెక్టర్-2 జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం నాడు కాకినాడ కలెక్టరేట్ లో మున్సిపల్ కమిషనర్, హౌసింగ్, tidco అధికారులతో ఇళ్ల స్థలాలను ప్రభుత్వ భూములు గుర్తింపుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి-2 జి.రాజకుమారి మాట్లాడుతూ దేవాదాయ, ఏపీఐఐసీ, ఇరిగేషన్ భూములు జిల్లాలో గుర్తించి వివరాలు కలెక్టరేట్కు అందజేయాలన్నారు. దేవాదాయ శాఖ భూములు కొనుగోలు చేసి లబ్దిదారులకు ఇవ్వడం జరుగుతుందని, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయని వివరాలు సమర్పించాలన్నారు. మండల స్థాయిలో తాసిల్దారు దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్లు కలిసి భూమి వివరాలు సేకరించాలన్నారు. మున్సిపాలిటీల్లో లబ్ధిదారుల జాబితా ఉన్నందున భూములు గుర్తించాలన్నారు. అర్బన్ ప్రాంతాల్లో 1.40 లక్షల మంది లబ్ధిదారులకు 300 ఎకరాల భూమి సేకరించాలనే ఆమె తెలిపారు. జిల్లాల్లో సెప్టిక్ ట్యాంక్ ప్రాజెక్ట్ కు మున్సిపాలిటీలో భూములు సేకరించి ఇవ్వాలని సూచించారు. స్పందన లో వచ్చిన అర్జీలు ఫిర్యాదులు పరిష్కారం నాణ్యతా పరంగా ఉండాలన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతను కమిషనర్ పరిశీలించాలని సూచించారు.