• Location
    Balaji Cheruvu, Kakinada
  • Tags
  • నగరంలోని పాత బస్టాండ్‌ ప్రాంతంలోని ఇఫ్టూ జిల్లా కార్యాలయంలో సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పి.ప్రదీప్‌ అధ్యక్షతన ఆదివారం కారల్‌మార్క్స్‌ 201వ, ద్విశత జయంతి ఉత్సవ ముగింపు సభ జరిగింది. ఈ సభలో సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.దుర్గాప్రసాద్‌, ఇఫ్టూ నగర కార్యదర్శి ఆర్‌.సతీష్‌, ఏఐకేఎంఎస్‌ జిల్లా నాయకులు వి.రామన్న, ఆశారత్నం, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి తిరుపతిరావు తదితరులు కారల్‌మార్స్క్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహర్లు అర్పించారు. అనంతరం సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ ప్రపంచ పెట్టుబడిదారీ వర్గం మార్క్స్‌ రచించిన దాస్‌ కాపిటల్‌కు కాలం చెల్లిందని సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. భూస్వామ్య, పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద దోపిడీపై పోరాడేందుకు మార్క్సిజం ప్రజలకు మార్గదర్శకంగా ఉంటుందన్నారు. కార్మికులు, రైతాంగ, దళితులు, ఆదివాసీ, మైనార్టీ, మహిళల హక్కులు కొల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర పాలకుల విధానాలను ఖండిస్తూ బలమైన ప్రజా పోరాటాలు నిర్వహించే దిశగా సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమొక్రసీ ముందడుగు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్‌ జిల్లా నాయకులు రాజబాబు, బసవరాజు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.