• Tags
  • కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో స్మార్ట్ సిటి ప్రోజక్ట్ లో భాగంగా జరుగుచున్న అభివృద్ధి పనులు మరియు వాటి పర్యవేక్షణ, అందు నిమిత్తం వచ్చిన నిధులు వివరములు పై స్మార్ట్ సిటి కార్పోరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు కమీషనర్ కాకినాడ నగరపాలక సంస్థ శ్రీ కె.రమేష్ గారు మరియు స్మార్ట్ సిటి కార్పోరేషన్ లిమిటెడ్ చీఫ్ ఇంజనీర్ మరియు సుపరింట్oడెంట్ ఇంజనీర్ కాకినాడ నగరపాలక సంస్థ శ్రీ విజయకుమార్ గారు ఈ విధముగా తెలియచేయుచున్నారు. కాకినాడ యందు 43 స్మార్ట్ సిటీ పనులకు 500 కోట్లతో టెండర్లు పిలవడం జరిగినదని పనులన్నీ శరవేగముతో జరిగుతున్నవని , ఇప్పటివరకు 18 పనులు పూర్తి చేయడం జరిగినది. కాకినాడ స్మార్ట్ సిటీ కు 384 కోట్ల నిధులు మంజూరు కాబడియున్నవి. స్మార్ట్ సిటీ పనులన్నియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ “ఎప్టిస”ఇంజనీర్స్, స్మార్ట్ సిటీ ఇంజనీర్స్ మరియు కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ఇంజనీర్స్ పర్యవేక్షణలో జరుగుచున్నవి. థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ పర్యవేక్షణలో నాణ్యతకు సంబందించిన పరీక్షలు వారి లాబరేటరీ నందు మరియు మొబైల్ ఆన్ సైట్ పరీక్షలు ఎప్పటికప్పుడు కమీషనర్ గారి ఆధ్వర్యములో పరిక్షలు జురుపుచూ త్వరితగతిన పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవటం జరిగినది. ఇందుపై నగర ప్రజలు ఏ విధమైన సందిగ్ధతకు లోను కావలదని తెలియ చేయుచున్నారు.