• కాకినాడ పోర్టు నుండి శంఖవరం మండలము అన్నవరం వరకు నిర్మించ తలపెట్టిన పోర్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వము నిర్ధేశించిన సాగరమాల ప్రాజెక్టు క్రింద నిర్మించతలపెట్టిన జాతీయ రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన భూసేకరణ నిమిత్తము రెవిన్యూ డివిజినల్ అధికారి వారి కార్యాలయములో ఈ రోజు ఉదయము కాకినాడ డివిజన్ స్థాయి సర్వేయర్ లు మరియు గ్రామ రెవిన్యూ అధికారులతో సమీక్షా సమావేశము 10.00 గంటలకు ఏర్పాటు చేయబడినది. సదరు సమావేశములో ఆర్.డి.వో జి.రాజకుమారి మాట్లాడుతూ కాకినాడ డివిజిన్ నందు కాకినాడ రూరల్ మరియు ఉప్పాడ కొత్తపల్లి మండలము సుమారు 736.42 ఎకరముల భూమి సంబంధిత సాగరమాల ప్రాజెక్టు క్రింద జాతీయ రహదారి నిర్మాణమునకు భూసేకరణ చేయవలసియున్నదని సదరు జాతీయ రహదారిని 53 కిలోమీటర్లు మేరకు నిర్మాణము జరపవలసియున్నదని తెలిపియున్నారు. సదరు నిర్మాణమునకు అవసరమైన భూ సేకరణ సర్వే పనులు సర్వే సిబ్బంది వేగవంతము చేయాలని సదరు భూ సేకరణలో ఏ విధమైన అలక్ష్యము వహించిన సర్వేయర్ లపై చర్య తీసుకొనబడునని అదే విధముగా లైసన్స్ డు సర్వేయర్ ల యొక్క సేవలు  కూడా వినియోగించుకోవాలి తెలిపియున్నారు. సదరు సమావేశములో కాకినాడ అర్బన్ తహాశీల్దారు సి.హెచ్.ఎస్.వి.ఆర్.ఎల్.ప్రసాద్, కాకినాడ రూరల్ తహాశీల్దారు బి.సోమశేఖరరావు, కాకినాడ డిప్యూటి ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఎం.శ్రీనివాసు, డిప్యూటి తహాశీల్దారు జె.వి.ఆర్.రమేష్, కె.ఎస్.వి.సుబ్బారావు కాకినాడ డివిజన్ నందలి మండల సర్వేయర్ లు మరియు లైసన్స్ డు సర్వేయర్లు, గ్రామ రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.