• పెద్దాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో జూనియర్ ఇంటర్లో ఖాళీగా ఉన్న క్లాసుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వి.మునిరామయ్య పేర్కొన్నారు. ఈ మేరకు అయన వివరాలు తెలియజేస్తూ ఇందులో ప్రవేశానికి గడువు ఈనెల 10వ తేదీతో ముగియనుండగా దానిని ఈనెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు చెప్పారు. ఫేజ్ - 2,3 పార్ట్స్లో ధ్రువపత్రాలు పరిశీలనకు ఈనెల 17 వరకు గడువు పొడిగించినట్లు వివరించారు.