You are here

Mayor and Commissioner KMC conduct a meeting with all High school HM's of KMC

Mayor and Commissioner KMC conduct a meeting with all High school HM's of KMC

 

 

 

 

కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి సుంకర పావని తిరుమలకుమార్ గారు మరియు కమీషనర్ శ్రీ కె.రమేష్ గారు ఈరొజు నగరపాలక సంస్థ సమావేశ మందిరము నందు నగరపాలక సంస్థల ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యయులతో సమావేశమును నిర్వహించినారు రాబోయే సమీప కాలంలో పదవ తరగతి పరిక్షలలో అందరు విద్యార్ధిని విద్యార్ధులు 10/10 జి.పి.ఎ.సాధించే విధముగా విధ్యభోదనను ప్రణాళికా బద్దంగా చేపట్టి విజయం సాధించాలని తద్వారా నగరపాలక సంస్థ పాటశాలలకు మంచి పేరు తీసుకొని రావలేనని ఆకాంక్షించినారు.ప్రస్తుతం నగరపాలక సంస్థ పాటశాలల యందు కార్పోరేట్ పాటశాలలకు ధీటుగా అన్ని వసతులు కల్పించుట జరిగినదని, సమీప భవిష్యత్తులో కార్పోరేట్ పాటశాలలకు గట్టి పోటిగా నగరపాలక సంస్థ పాటశాలలు ఉండాలని ఉద్ఘాటించారు. లోగడ వచ్చిన ఫలితములను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు ఇంకా మెరుగైన విద్యని అందించాలని,ప్రజలు అందరూ వారి వారి పిల్లలను నగరపాలక సంస్థ పాటశాలల యందు చేర్పించేల చూడాలని ,పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు నగరపాలక సంస్థ పాటశాలలు మంచి బాటలు గా ఎన్నుకోవలేనని కోరినారు.సదరు కార్యక్రమమునకు నగరపాలక సంస్థ ఉన్నత పాటశాలల ప్రధానోపాధ్యయులు మరియు నగరపాలక సంస్థ మేనేజరు, పాటశాలల పర్యవేక్షకుడు, హాజరుఅయునారు.

Advertisement

Share this content.