• Tags
  • ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలోని ప్రాథమిక, సామాజిక, ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాల్లో 6,265 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ రమేశ్‌కిషోర్‌ తెలిపారు. 29 మంది ప్రభుత్వ, 20 మంది ప్రైవేటు గైనకాలజిస్టులు ఈ వైద్య పరీక్షలు నిర్వహించారన్నారు. మాతా, శిశు మరణాలు కనిష్ఠస్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా దీన్ని చేపట్టినట్లు తెలిపారు.