• జిల్లాలో వికలాంగులకు అందించే ధృవపత్రాల జారీలో ఎదుర్కొంటున్న
  సమస్యలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలక్టర్ మురళీధర్ రెడ్డి
  సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారంనాడు కాకినాడ కలక్టరేట్
  ప్రజావాణి మందిరంలో నిర్వహించిన మీకోసం ప్రజావాణిలో పలువురు వికలాంగులు
  సదరమ్ ధృవ పత్రాలను పొందడంలో ఎదురౌతున్న సమస్యలను కలక్టర్ దృష్టికి
  తెచ్చారు. ధవళేశ్వరంకు చెందిన గడియకారి భావన నారాయణ సదరమ్ ధృవపత్రం
  కోసం దరఖాస్తు చేసానని, గత రెండు సంవత్సరాలుగా ఈ ధృవపత్రం పెండింగ్ లో
  వుందని కలక్టర్ కు వివరించారు. అదే విధంగా మరి కొందరు వికలాంగులు కూడా ఇదే
  సమస్యను కలక్టర్ దృష్టికి తీసుకు రావడంతో ఈ సమస్య పరిష్కారం పై
  కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.యం.రాఘవేంద్రరావు,
  డి.ఆర్.డి.ఏ. పిడి మధుసూదనరావును మీ-సేవ అధికారులను పిలిపించి వారితో
  కలక్టర్ చర్చించారు. వికలాంగులు మీ-సేవలో దరఖాస్తు చేసుకోవడం, స్లాట్
  లు కేటాయింపు, వైద్యుల పరీక్ష, ధృవపత్రాల జారీ వంటి పనులు కోసం సమయం
  పడుతుందని సంబంధిత అధికారులు కలక్టర్ కు వివరించారు. ఈ విషయమై కలక్టర్
  మాట్లాడుతూ సదరమ్ ధృవీకరణ పత్రాల జారీ సరళీకృతం చేయాలని ఈ ధృవ
  పత్రాలను జాప్యం లేకుండా జారీ చేయడానికి విధి విధానాలను రూపొందించాలని
  ఆదేశించారు. అదే విధంగా పెండింగ్ లో వున్న సదరమ్ ధృవపత్రాలు వెంటనే
  జారీ చేయాలని కలక్టర్ ఆదేశించారు. పెదపూడి మండలం రామేశ్వరం
  గ్రామానికి చెందిన జిత్తుగ వీరవేణి కిడ్నీ సమస్యల మూలంగా డయాలసిస్
  వైద్యం పొందుతున్నందున ఫింఛన్ మంజూరు చేయాలని కలక్టర్ ను కోరగా
  వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కలక్టర్ ఆదేశించారు. ప్రజల నుండి
  వచ్చిన పలు సమస్యలపై సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని
  అధికారులను కలక్టర్ ఆదేశించారు.
  సోమవారంనాడు కాకినాడ కలక్టరేట్ వివేకానంద ప్రజావాణి హాలులో
  మీకోసం కార్యక్రమం నిర్వహించగా, 281 అర్జీదారులు హాజరై తమ
  ఫిర్యాదులు, అర్జీలు, విజ్ఞాపనలు జిల్లా కలక్టరు డి.మురళీధర్ రెడ్డి,
  జేసి-2 సిహెచ్.సత్తిబాబు, డిఆర్ఓ యం.వి.గోవిందరాజులకు అందజేసారు. ఈ
  సందర్భంగా జిల్లా కలక్టర్ డి .మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ
  అర్జీదారులు అర్జీలు పరిష్కారంలో సత్వర చర్యలు చేపట్టాలని, పరిష్కారం
  కానిచో దానికి గల కారణాలు తెలియజేస్తూ అర్జీదారులకు అర్జీని త్రిప్పి
  పంపాలన్నారు. వికలాంగులు సదరమ్ సర్టిఫికేట్లు కావాలని, దివ్యాగుల
  బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, ఉద్యోగాలు కావాలని అధిక
  సంఖ్యలో యువత హాజరై కలక్టర్ కు తమ విజ్ఞాపనలు అందజేసారు. ఇళ్ళు
  కావాలని, కుటుంబ దగాదాలు, భూ సమస్యలు పరిష్కరించాలని, పింఛన్లు , రేషన్
  కార్డులు కావాలని, ఇళ్ళ స్ధలాలు మంజూరు చేయాలని అర్జీదారులు కలక్టరుకు
  తమ అర్జీలు అందజేసారు. గన్నవరం మండలం పోతవరం గ్రామానికి చెందిన
  అంధురాలు కొత్తపల్లి మారమ్మ తమకు ప్రభుత్వం 2003 సం.లో రెండున్నర
  సెంట్లు ఇళ్ళ స్ధలం మంజూరు చేసిందని, గత 30 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో
  నివాసముంటున్నారు. ఆ స్ధలంలో ప్రక్క అసామి తమ యెక్క స్ధలంలో మట్టి
  వేస్తున్నారని అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని పోలీస్ స్టేషన్ లో
  తెలుపగా వారు న్యాయం చేయలేదని కలక్టరుకు ఫిర్యాదు చేయగా గన్నవరం
  తాహశిల్దారును క్షేత్ర స్ధాయిలో పర్యటించి విచారణ జరిపి తగు చర్యలు
  చేపట్టాలని కలక్టరు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తహశిల్దారుకు
  ఆదేశించారు. గండేపల్లి మండలం తిరుపతిరాజాపురం గ్రామానికి చెందిన
  కాండ్రేగుల సోమయ్య ఇరిగేషన్ శాఖలో లస్కర్ గా పని చేసి
  రటైర్అయ్యానని తన భార్య, బొల్లి చినవెంకటరావు వద్ద 4 లక్షల
  రూపాయలు దాచిందని ఆ సొమ్ము తిరిగి ఇవ్వమని అడిగితే ఇవ్వటం లేదని సదరు

  సొమ్ము ఇప్పించాలని కలక్టరు కు ఫిర్యాదు చేయగా పెద్దాపురం ఆర్.డి.ఓ.ను
  పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని కలక్టరు ఆదేశించారు.
  మండపేటకు చెందిన కంటిపూడి కృష్ణవేణి తమ ఇంటిని ఆనుకుని కళ్యాణి
  వైన్స్ షాపు పెట్టారని, ఆ షాపు వల్ల తమ ఇంటిలోగల పోర్షన్ కు ఎవ్వరు
  అద్దెకు రాలేదని గతంలో జిల్లా కలక్టరుకు ఫిర్యాదు చేయగా 4 నెలల పాటు
  ఇంటి అద్దె ఇచ్చారని, తదుపరి అద్దె చెల్లించడం మానివేసారని కడు
  బీదానినని, ఇల్లు తప్పవేరే ఆధారం లేదని కలక్టరుకు ఫిర్యాదు చేయగా
  డిప్యూటీ కమీషనర్ ఎక్సైజ్ శాఖ విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలని
  కలక్టరు ఆదేశించారు. కాకినాడ రూరల్ సర్పవరకు చెందిన బి.శంకర్ రెడ్డి
  సర్వే నెం.247 గజములు నివేశన స్ధలం ఉందని, సర్వే నెం.35,36లలో 48 ఎకరములు
  ప్రభుత్వ భూమిలో 600 కుటుంబాలు నివాశముంటున్నారని వారందరికి పట్టాలు
  ఇచ్చారని రిజిస్ట్రేషన్ చేయటం లేదని కలక్టరుకు ఫిర్యాదు చేయగా
  జిల్లా రెవెన్యూ అధికారిని పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని కలక్టర్
  ఆదేశించారు. కాకినాడ జగన్నాధపురంకు చెందిన ఉబ్బన మురళీ కృష్ణ
  వికలాంగుడునని కాలు యాక్సిడెంట్ లో పోయిందని వికలాంగ పింఛన్ కొరకు
  సదరమ్ సర్టిఫికేట్ లేనందున పింఛను మంజూరు కాలేదని కలక్టరుకు ఫిర్యాదు
  చేయగా, మీ-సేవ ఎఓ, జిజిహెచ్ సూపరింటెండెంట్ కు తగు చర్యలు చేపట్టాలని
  కలక్టర్ ఆదేశించారు. చింతూరు మండలం ఉల్లుమర్రు గ్రామానికి చెందిన పోసం
  రమ్య దివ్యాగురాలని గతంలో వికలాగ కోటాలో కమాటిగా ఎంపికై
  అపాయింట్మెంట్ పొందింనందున కలక్టరును కలిసి వివరించగా, రంపచోడవరం
  ఐటిడిఏ పిఓను కలిసి పోస్టింగ్ ఆర్డరు పొంది విధులకు హాజరు కావల్సిందిగా
  కలక్టరు మురళీధర్ రెడ్డి సూచించారు. కె.గంగవరం మండలం కు చెందిన
  యం.రాంబాబు, కె.గణపతి , యు.వరప్రసాద్ అంధులమని వికలాంగ బ్యాక్ లాగ్
  పోస్టులు పూర్తి స్ధాయిలో రిక్రూట్మెంట్ చేయాలని కలక్టరుకు అర్జీని
  సమర్పించగా, సంబంధిత అధికారులు దివ్యాంగులు బ్యాక్ లాగ్ వెకెన్సీ
  రిక్రూట్మెంట్ కు నివేదికలు సమర్పించాలని కలక్టరు ఆదేశించారు.
  ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు
  పాల్గొన్నారు.
  కలక్టర్ ను కలిసిన రాజోలు ఎం.ఎల్.ఏ. రాపాక వర ప్రసాద్.
  రాజోలు ఎం.ఎల్.ఏ. రాపాక వరప్రసాద్ కలక్టర్ డి.మురళీధర్ రెడ్డిను
  సోమవారంనాడు ప్రజావాణి మీటింగ్ హాల్ లో మర్యాద పూర్వకంగా కలిసి
  పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు.