You are here

Minister Nara Lokesh will Tour Pithapuram on 11 January

Minister Nara Lokesh will Tour Pithapuram on 11 January

 

 

 

 

పంచాయతీరాజ్‌శాఖ మంత్రి లోకేష్‌ 11వ తేదీన పిఠాపురంలో పర్యటిస్తారని ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. పట్టణంలోని ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ క్రీడా మైదానంలో నిర్వహించే జన్మభూమి సభలో పాల్గొని మాట్లాడుతారన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే, జడ్పీ సీఈవో బి.విద్యాసాగర్‌ ప్రత్యేక పోలీసు బృందం సభ స్థలాన్ని బుధవారం పరిశీలించారు. రూ.35 కోట్లతో చిత్రాడ చెరువులో నిర్మించిన తాగునీటి ప్రాజెక్టు, మున్సిపల్‌ కల్యాణ మండపం వద్ద నిర్మించిన అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ పిల్లి చిన్న, గుడా డైరెక్టర్‌ పిల్లి రవికుమార్‌, ఆత్మ ఛైర్మన్‌ ఎలుబండి రాజారావు, మున్సిపల్‌ కమిషనర్‌ కొండలరావు, ఏఈ వంశీ అభిషేక్‌, ఎంపీడీవో కేఎస్‌ఎస్‌ సుబ్బారావు, తదితరులున్నారు.

Advertisement

Share this content.