• జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయం వెనక ఉన్న ఏఆర్‌ పోలీసు క్వార్టర్స్‌ను ఇటీవల ఆధునికీకరించారు. పోలీసు కుటుంబాలకు ఎంతో వెసులుబాటుగా వీటిని ఆధునీకరించారు. శుక్రవారం ఈ గృహాలను ఎస్పీ విశాల్‌గున్ని దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయోగాత్మకంగా పాత భవనాలను ఆధునికీకరించామన్నారు. ఎస్పీ కార్యాలయంలో వాహనాల పార్కింగ్‌ షెడ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీధరరావు, వీఎస్‌ ప్రభాకరరావు, డీఎస్పీలు అప్పారావు, మురళీమోహన్‌, పల్లపురాజు తదితరులు పాల్గొన్నారు.

     

    మరణించిన ఎస్‌ఐ కుటుంబానికి రూ.10 లక్షలు

    ప్రమాదవశాత్తు కాలువలో కారుపడి మరణించిన ఎస్‌ఐ తోట వంశీధర్‌ కుటుంబానికి శుక్రవారం జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయంలో ఎస్పీ విశాల్‌గున్ని రూ.10లక్షల ప్రమాద బీమా సొమ్మును అందజేశారు. ఈ కుటుంబానికి ఇంకా రావాల్సిన రాయితీలు త్వరగా అందించాలని పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు.