• కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్‌. సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జి.ఆస్కారరావు జిల్లా కార్యవర్గాన్ని సమావేశానికి పరిచయం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడుగా వాసా శామ్యూల్‌ దివాకర్‌(రెవెన్యూ), కార్యదర్శిగా ఎంవీవీ సత్యనారాయణ(వైద్య, ఆరోగ్యం), సహ అధ్యక్షుడిగా సీహెచ్‌ పాపారావు(ర.భ), ఉపాధ్యక్షులుగా నక్కా రమేశ్‌, పి.మురళి(వైద్య, ఆరోగ్యశాఖ), బి.నూకరాజు(ప్రభుత్వ డ్రైవర్ల సంఘం), శరభరాజు(పంచాయతీరాజ్‌), బి.రుష్యేంద్రకుమార్‌ (మత్స్య శాఖ), పి.తారకేశ్వరరావు(దేవాదాయ శాఖ), డి.శ్రీవల్లి(ప్రభుత్వ ఐటీఐ), సంయుక్త కార్యదర్శులుగా వై.లక్ష్మి(ఐసీడీఎస్‌), బి.కృష్ణ(ఆర్‌డబ్ల్యుఎస్‌), టి.మోజెస్‌ప్రసాద్‌(ఎక్సైజ్‌), ఎ.సుధాకర్‌(సహకార శాఖ), కార్యనిర్వాహక కార్యదర్శిగా పి.సుబ్బారాయుడు(ఐసీడీఎస్‌), కోశాధికారిగా కేవీఎస్‌ రవికుమార్‌(వాణిజ్య పన్నుల శాఖ) ఎన్నికయ్యారు.