• ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రెండో దశ వెబ్‌ కౌన్సెలింగ్‌ ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని, మొదటి దశలో సీటు పొందని అభ్యర్థులు రెండో దశకు హాజరుకావచ్చని డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ డా.డి.జ్యోతిర్మయి తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కౌన్సెలింగ్‌ కోసం అయిదు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం తొమ్మిది గంటల ప్రారంభమవుతుందన్నారు. 21 నుంచి 23 వరకు విద్యార్థులకు వెబ్‌ఆప్షన్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

    20న ఎంపీఈడీ కౌన్సెలింగ్‌

    ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎంపీఈడీ వెబ్‌ కౌన్సెలింగ్‌ ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని డా.జ్యోతిర్మయి తెలిపారు. రిజిష్ట్రేషన్‌ ఫీజు జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌లకు రూ.250లగా నిర్ణయించామన్నారు. మొదటి దశలో ఫీజు చెల్లించినవారు మరలా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యేవారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, వాటి నకళ్లు, నాలుగు పాస్‌పోర్టు సైజు ఫొటోలను వెంటతెచ్చుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ www. aknu.edu.in లేదా 7093008477 నంబరులో సంప్రదించవచ్చని చెప్పారు.