• జిల్లా ఎస్పీగా అద్నాన్‌ నయీమ్‌ అస్మి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన విశాఖ జోన్‌-2 డీసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. జమ్ము-కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన నయీమ్‌ అస్మి పొలిటికల్‌ సైన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశారు. 2013లో ఐపీఎస్‌కు ఎంపికైన ఆయన 2015లో గ్రేహౌండ్స్‌లో అసాల్ట్‌ కమాండర్‌గా విధులు నిర్వహించారు. 2016 జనవరి 3 నుంచి 2018 జనవరి వరకు రంపచోడవరం ఏఎస్పీగా పనిచేశారు. అనంతరం పదోన్నతిపై అడిషనల్‌ ఎస్పీగా (ఆపరేషన్స్‌) కడప జిల్లాకు బదిలీ అయ్యారు.రంపచోడవరంలో పనిచేసిన సమయంలో గిరిజన ప్రాంత ప్రజలకు పలు సేవలు అందించి వారి అభిమానాన్ని చూరగొన్నారు. ఈ సందర్భంగా బుధవారం నయీమ్‌ అస్మి మాట్లాడుతూ గతంలో జిల్లాతో అనుబంధం ఉందని, మళ్లీ పదోన్నతిపై ఇక్కడకు రావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

    పేరు - అద్నాన్ నయీమ్ అస్మి 

    కేడర్ - 2013 ఐపీఎస్ బ్యాచ్ 

    విద్యార్హత - పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ 

    స్వస్థలం - జమ్ము - కాశ్మీర్లోని శ్రీనగర్ 

    విద్యాభ్యాసం - ఢిల్లీ