• Location
    Bhanugudi, Kakinada
  • Tags
  • కాకినాడలోని అన్నవరం సత్యవతి దేవి మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న మూడో ఆంధ్రా గర్ల్స్‌ బెటాలియన్‌ ఏన్‌సీసీ క్యాడెట్ల శిక్షణ కార్యక్రమాన్ని గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ నాయుడు ఆదివారం పరిశీలించారు. ఎన్‌సీసీ వల్ల దేశభక్తి, క్రమశిక్షణ అలవడుతుందన్నారు. ఈ శిబిరంలో మ్యాప్‌ రీడింగ్‌, మొక్కలు నాటడం, ఫైరింగ్‌ తదితర అంశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌వోలు ప్రమీలారాణి, త్రిపుల, శ్రీదేవి, భ్రమరాంబ, కల్యాణి, తదితరులు పాల్గొన్నారు.