• కాకినాడ ఆర్టీసీ బస్ డిపో నుంచి శుక్రవారం నూతన సర్వీస్ ప్రారంభించారు. కాకినాడ నుంచి తిరుపతికి నైట్ రైడర్ పేరిట ఏసీ బస్ సర్వీస్ డి ఎం పి భాస్కర రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నూతన సర్వీసులను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ బస్సులో 20 బెర్తులు, 22 సీట్లు ఉంటాయి అన్నారు. బస్సు సాయంత్రం 5. 15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు తిరుపతి చేరుతుందన్నారు. మరో బస్సు సాయంత్రం 6. 15 గంటలకు తిరుపతి లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7. 05 గంటలకు కాకినాడ చేరుతుందన్నారు. సిట్టింగ్ కు రూ.1290 అప్పర్ బెర్త్ కు రూ.1480 లోయర్ బర్త్ కు రూ.1620 గా టికెట్ ధర నిర్ణయించినట్లు పేర్కొన్నారు.