• జిల్లా ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్‌ అధికారుల సంఘ సమావేశం ఆదివారం కాకినాడలో జరిగింది. కచ్చేరిపేటలోని అంబేడ్కర్‌ సామాజిక భవనంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శీనయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా శాంతిరాజశ్రీ(లెక్చరర్‌, పిఠాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల), కార్యదర్శిగా భానుప్రకాష్‌(ఏపీడీ, డ్వామా), ఉపాధ్యక్షులుగా డి.దుర్గాలక్ష్మి(ఏడీ, వ్యవసాయ శాఖ), సంయుక్త కార్యదర్శిగా మెహర్‌(లెక్చరర్‌, పీఆర్‌ డిగ్రీ కళాశాల), కోశాధికారిగా వేణుగోపాల్‌(డీఈ, కాకినాడ నగరపాలక సంస్థ) తదితరులు ఎన్నికయ్యారు. అనంతరం పలు అంశాలపై చర్చించి తీర్మానించారు. త్వరలో రాష్ట్రంలో గల ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో కలసి సీఎం జగన్‌మెహన్‌రెడ్డిని కలిసి సమావేశం కావాలని తీర్మానించారు. సమావేశంలో సీపీవో రత్నబాబు, పరిశ్రమల శాఖ డీడీ డేవిడ్‌, పశుసంవర్థక శాఖ ఉప సంచాలకుడు గిరీష్‌, గృహనిర్మాణ శాఖ డీఈ రాజ్‌కుమార్‌, పీఆర్‌ కళాశాల లెక్చరర్‌ గోవింద్‌, డీసీటీవో నకులుడు, ఏఈ జీవప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.