• జిల్లాకు కలెక్టర్‌గా నియమితులైన డి.మురళీధర్‌రెడ్డి గురువారం కాకినాడ రానున్నట్లు కలెక్టరేట్‌ వర్గాలు తెలిపాయి. ఆయన గురువారం సాయంత్రానికి కాకినాడ చేరుకుని స్థానిక ర.భ.శాఖ అతిథి గృహంలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బదిలీ అయిన కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాకు గురువారం సాయంత్రం 5 గంటలకు కలెక్టరేట్‌లోని వివేకానంద ప్రజావాణి మందిరంలో వీడ్కోలు సభ నిర్వహించనున్నారు. జిల్లా అధికారులు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆయనను సత్కరించనున్నారు.