Nursing Exam Centres Observed by RDO Raghubabu
నర్సింగు పరిక్షా కేంద్రాలను పరిశీలించిన ఆర్.డి.ఓ రఘుబాబు
స్థానిక రంగరాయ మెడికల్ కళాశాల (GNM నర్సింగు) పరీక్షా కేంద్రాలను కాకినాడ ఆర్.డి.ఓ తనిఖీ చేశారు. ఈ నెల 2 వ తేది నుండి ప్రారంభమై 15 వ తేది వరకు జరుగు నేపధ్యములో కాకినాడ ఆర్.డి.ఓ ఎల్.రఘుబాబు ఈ రోజు ఉదయం పరిక్షా కేంద్రాలను సందర్శించియున్నారు. ఆర్.డి.ఓ ఎల్.రఘుబాబు మాట్లాడుతూ సదరు పరిక్షా కేంద్రాలలో మాస్ కాఫీయింగ్ జరగకుండా చూడాలని అదేవిధముగా పరిక్షా వ్రాస్తున్న విద్యార్దులకు త్రాగు నీరు, విధ్యుత్, వైద్య సౌకర్యం ఏర్పాట్లు చేయాలని పరిక్షా నిర్వాహకులను ఆర్.డి.ఓ ఆదేశించియున్నారు. సదరు పరిశీలనలో ఆర్.డి.ఓ రఘుబాబుతో పాటు ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపర్డెంటు డా. ఎం. రాఘవేంద్రరావు, కె.ఎస్.వి.సుబ్బారావు తదితరులు పాల్గోన్నారు.
సి.సి.కెమేరాల నిఘాలో నర్సింగు పరిక్షా కేంద్రాలు జి.జి.హెచ్. సూపరింటెండెంటు డా.ఎం. రాఘవేంద్రరావు వెల్లడి
స్ధానిక రంగరాయ మెడికల్ కాలేజి నందు ఈ నెల 2 నుండి 15 వ తేది వరకు జరుగు (GNM నర్సింగు) పరిక్షా కేంద్రాల యందు మొదటి సారిగా 10 సి.సి.కెమేరాలు ఏర్పాటు చేయడమైనదని ఏ విధమైన మాస్ కాఫియింగుకు ఆస్కారము లేకుండా నిరంతరము సి.సి.కెమేరాల ద్వారా పరిక్షల నిర్వహణ పర్యవేక్షించున్నామని ముఖ్యముగా అదనపు బద్రతా సిబ్బందిని నియమించి ప్రతి ఒక్క విధ్యార్ధిని తనిఖీ చేయుచున్నామని ఇప్పటివరకు మాస్ కాఫీయింగుకు పాల్పడిన నలుగురు విద్యార్ధులను డిబార్ చేసి వైద్య ఆరోగ్య సంచాలకుల వారికి నివేదిక సమర్పించడమైనదని పరిక్షల కన్వీనర్ మరియు జి.జి.హెచ్ సూపరింటెండెంటు డా. ఎం. రాఘవేంద్రరావు తెలిపియున్నారు.
Like us on Facebook
© 2016. Kakinada9.com. All Rights Reserved.