•  

    అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఈనెల 22వ తేదీన ఒలింపిక్ రన్ నిర్వహించనున్నట్లు జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి కే. పద్మనాభం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 23న విజయవాడలో ఒలింపిక్ సంఘం చైర్మన్ ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్ అండ్ బీ శాఖ మాత్యులు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ఒలింపిక్ రన్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. 23న రాజధాని నగరంలో జరిగే రన్ కు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ఈ రన్ కు జిల్లా నుంచి వంద మంది హాజరు కానున్నారని ఆయన తెలిపారు. ఆసక్తిగల వ్యాయామ ఉపాధ్యాయులు ఎవరైనా తమ తమ ప్రాంతాల్లోనూ రన్ నిర్వహించాలని నిర్ణయిస్తే జిల్లా ఒలింపిక్ సంఘానికి తెలియజేస్తే సంఘం తరపున రన్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక పత్రాలు అందజేస్తామన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించే రన్ కు కన్వీనర్లుగా డాక్టర్ పి చిరంజీవినీ కుమారి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు, కో కన్వీనర్లుగా వై తాతబ్బాయి, డాక్టర్ కె స్పర్జన్ రాజు, వీ రవి రాజు వ్యవహరిస్తారన్నారు వివరాలకు 9849270977 నంబర్ యందు సంప్రదించాలన్నారు.