• Collector D. Muralidhar Reddy, Kakinada City MLA Dwarampudi Chandrashekhar Reddy and Mayor Sankara Pavani inaugurated digital classroom in Rajiv Gandhi Municipal High School at Anandabharati Grounds in collaboration with city Indian Oil Corporation.

    In this ocassion  the Collector was speaking about the digital education policy and mentioned that with such opportunities students will be interested in education.Also , Collector, Mayor, City Legislators, Municipal Commissioner congratulated  and honored all the students selected for IITs from the school.

    S. Abraham, Deputy Mayor of the event Kala Satibabu, G.M. (HR-CSR) Indian Oil Corporation SS Prasad, Smart Andhra Pradesh Foundation CEO B. Ganganaya, Municipal High School H.M. SVL Raju, ICDS Local Manager P Ram Kumar, Srinivas professors and others attended the event.

     

    నగరంలోని ఆనందభారతి గ్రౌండ్స్ వద్ద వున్న రాజీవ్ గాందీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
    సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ను జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి , కాకినాడ సిటీ యంఎల్ఏ ద్వారంపూడి
    చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ సుంకర పావని ప్రారంభించారు.

     ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ డిజిటల్ విద్యా విధానం ద్వారా విద్యార్ధులకు విద్యను అందించేందుకు అవకాశం కల్గుతుందని, దీని ద్వారా విద్యార్ధులకు విద్య పట్ల ఆసక్తి పెరుగుతుందని అన్నారు.ఈ సందర్భంగా ఈ పాఠశాల నుండి ఐఐఐటికు ఎంపికైన విద్యార్ధుల తల్లిదండ్రులను కలక్టర్, మేయర్, సిటీ శాసన సభ్యులు, మున్సిపల్ కమీషనర్ కె.రమేష్ అభినందించారు. 

    ఈ పాఠశాలకు చెందిన పి.జానకీ రమణయ్య, కె.అఖిల్ వెంకట్, కె.అఖిల్ కుమార్, వి.ఇసాక్ నలుగురు విద్యార్ధులు ఐఐఐటి నూజివీడ్, ఒంగోల్ కళాశాలలకు సెలక్ట్ అయినందుకు వాళ్ల తల్లిదండ్రులను కలక్టర్ , మేయర్, సిటీ శాసన సభ్యులు సత్కరించారు.

    ఈ కార్యక్రమంలో డిఇఓ ఎస్.అబ్రహం, డిప్యూటీ మేయర్ కాళా సత్తిబాబు, జి.యం.(హెచ్.ఆర్.-సిఎస్ఆర్) ఇండియన్ ఆయిల్
    కార్పొరేషన్ ఎస్.ఎస్.ప్రసాద్, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ సిఇఓ బి.గంగయ్య, మూన్సిపల్ హైస్కూల్ హెచ్.యం.
    ఎస్.వి.ఎల్.రాజు, ఐసిడిఎస్ లోకల్ మేనేజర్ పి.రామ్ కుమార్,శ్రీనివాస్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.