You are here

Pawankalyan Meeting with Sanitation Workers and Doctors at G Convention Kakinada

Janasena Party Chief Sri Pawankalyan Meeting with Sanitation Workers and Doctors at G Convention Hall Kakinada

 

 

కాకినాడ జి కన్వెన్షన్ హాలులో జనసేన అధ్యక్షులు శ్రీ పావన్ కల్యాణ్ మొదటిగా ఉదయం పారిశుధ్య కార్మికులతో సమావేశమయ్యారు. తరువాత మధ్యాహ్నం వైద్యులతో ఆయన సమావేశమయ్యారు. 

 

రాజకీయాల్లో చెత్తను శుభ్రం చేయటానికే పార్టీ పెట్టా - పవన్ కళ్యాణ్ 

 

Janasena-Kakinada-meeting-3.jpg

 

 

ఏ కులం, ఏ ప్రాంతం, ఏ మతంలో పుట్టాలో మన చేతుల్లో లేదని, భగవంతుడు ఆ అవకాశం కల్పిస్తే నేను మాత్రం రెల్లి కులంలో పుట్టాలని కోరుకుంటానని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అందరూ మతాలను స్వీకరిస్తారు.. నేను మాత్రం ఇవాళ రెల్లి కులం స్వీకరించానన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నత కులం ఏదైనా ఉందంటే అది రెల్లి కులమేనన్నారు. చప్పట్లు కొట్టించుకోవడానికి ఈ మాట చెప్పడం లేదని, మనసు బరువెక్కి, కన్నీళ్లతో చెబుతున్నానని అన్నారు. నేడు కాకినాడలోని జి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు ముందు పారిశుద్ధ్య కార్మికులు కన్నీటితో తమ సమస్యలను విన్నవించారు. తమకు ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదని, ఇప్పటికీ  అంటరానివాళ్ళలా చూస్తున్నారని ఇల్లు లేక ఊరి బయట పూరి గుడిసెల్లో బతుకుతూ రోగాల బారినపడి చస్తున్నామని కన్నీరుపెట్టారు. ప్రతి కార్మికునికి పక్కా ఇల్లు ఏర్పాటు చేయాలని, 279 జీవో రద్దు, ఒప్పంద పొరుగు సేవల పద్ధతిలో పని చేస్తున్న కార్మికులను క్రమబద్దీకరించాలని చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కార్మికులకు ప్రభుత్వపరంగా అందించాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.

 

 

Janasena-Kakinada-meeting-2.jpg

 

 

కార్మికుల సమస్యలు విన్న తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ .. "పారిశుధ్య కార్మికులు పరిసరాలను శుభ్రం చేసినట్టే నేను రాజకీయాల్లో చెత్తను శుభ్రం చేయడానికి వచ్చాను. అందుకే పార్టీ పెట్టాను. మానవ సేవే పరమావధిగా, చెత్తను శుబ్రపరిచే  మీ జీవితాల్లో వెలుగులు నింపకపోతే జాతికి ద్రోహం చేసిన వాళ్లమవుతాం. ఒక రెల్లి చెల్లి చెప్పినట్లు భగవంతుడు 3 రూపాల్లో ఉంటాడు. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడు రూపంలో, అన్నం పెట్టే రైతు రూపంలో, చెత్తను శుభ్రం చేసే పారిశుధ్య కార్మికుల రూపాల్లో ఉంటాడు. దశాబ్దాలు పోరాటం చేసే నాయకులు కంటే కష్టాన్ని అనుభవించే పారిశుద్ధ్య కార్మికుల గొంతు నుంచి వచ్చే మాటలు హృదయాన్ని కదిలిస్తాయి, కన్నీళ్లు తెప్పిస్తాయి. నేను ఆశయాలను ఆచరిస్తాను, పాటిస్తాను తప్ప మాట్లాడను. అణగారిన కులాల్లో వెలుగులు నింపకపోతే అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసిన ప్రయోజనం ఏముంది, జై భీమ్ ఉపయోగమేముంటుంది ? ఖనిజాలు, కాంట్రాక్టులు, డ్యాములు పేరుమీద వేల కోట్లు దోచేయడం  తప్పితే 50 మంది కార్మికులకు ఇల్లు కట్టలేరా ?  స్వచ్ఛ భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చేయమని కేంద్రమంత్రి కోరితే తిరస్కరించాను. మనసులో ఉన్న చెత్తను శుభ్రం చేయకుండా, బయట చెత్తను శుభ్రం చేస్తే  ప్రయోజనం ఏమిటి ?

 

Janasena-Kakinada-meeting-1.jpg

 

అన్ని కులాల తో పాటు రెల్లి కులానికి సమానహక్కులు కల్పిస్తాం. రెల్లి కులస్తులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించే దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తుంది. సమాన పనికి సమాన వేతనం, జీతం నాలుగు నెలలకు ఒకసారి వచ్చేలా కాకుండా నెల నెల వచ్చ్చేలా చర్యలు తీసుకుంటాం. అలాగే పారిశుధ్య కార్మికులకు ఆహ్లాదకరమయిన వాతావరణంలో ఇల్లు ఏర్పాటు చేస్తాం. 279 జీవో రద్దుకు ఉన్న అన్ని అవకాశాలు పరిశీలిస్తాం. మీరు ఓట్లు వేసినా వేయకపోయినా జనసేన పార్టీ పారిశుధ్య కార్మికులకు అండగా ఉంటుంది. పారిశుధ్య కార్మికులు ఎలా బతుకుతున్నారో పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. కార్మికులు అద్ద్దెకు ఇల్లు అడుక్కోవడం కాదు..వాళ్లే ఇల్లు అద్దెకు ఇచ్చేలా ఆర్థిక బలం చేకూర్చుతామన్నారు.

 

మధ్యాహ్నం డాక్టర్ల సమావేశంలో శ్రీ పవన్కళ్యాణ్ గారు మాట్లాడుతూ...

"నేను సమాజంలో సమస్యలను చూసి విఫల భావాలతో తుపాకీ పడదాం అనుకుంటే అన్నయ్య వారించడంతో సినిమాల్లో మార్పు కోసం నాలుగు మాటలు చెప్పే వాడిని. ముఖ్యమంత్రి గారు నా కులం, నా మతం అని మనం ఓటు వేస్తూ పోతే ఈ వ్యవస్థ ఎలా బాగుపడుతుంది. ఇంకెంతకాలం కులాలు చూసి ఓటు వేస్తాం, ఇక్కడ ఐదు సంవత్సరాలు కష్టపడి చదివి డాక్టర్ అయితే కనీసం పంచాయతీ సర్పంచ్ గా కూడా పోటీ చేయని వ్యక్తి మంత్రి అయి మనల్ని పరిపాలించే దౌర్భాగ్యం లో రాష్ట్రం ఉంది. ఎంతసేపు వ్యక్తిగత లాభం చూసుకొని పని చేస్తే ప్రజలందరికీ వైద్య సదుపాయాలు ఎలా కల్పిస్తారు. వ్యవస్థను నడిపే ముక్తులు అవినీతిలో కూరుకు పోతే మరి ఈ వ్యవస్థను ఎవరు ప్రక్షాళన చేస్తారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎవరు ఏర్పాటు చేస్తారు. ఈరోజు ఇక్కడకు వచ్చిన ప్రతి యువ డాక్టర్ లో కూడా ఒక చేగువేరా ని చూశాను. చేగువేరా అనే వ్యక్తి అందరికీ ఒక విప్లవ నాయకుడిగా అభిమానిస్తే నాకు ఒక డాక్టర్గా కూడా అభిమానిస్తాను. చికిత్స చేయడం కంటే కూడా నివారించడం ముఖ్యమనేది నేను నమ్ముతాను.

 

Janasena-Kakinada-meeting-4.jpg

 

జనసేన వైద్యశాఖ విషయంలో చాలా చిత్తశుద్ధితో ఉంటుంది, ఈ మార్పు లో మీ అందరి సహాయ, సహకారాలు అందిస్తూ మాకు అండగా ఉండాలని ఆశిస్తున్నాను. విద్య, వైద్యం అందరి హక్కు, మరి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ప్రజల పన్నులు ఉండి కూడా మీరు మాకు అండగా నిలబడి పోతే ఎలా ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని వాటి నుంచి మంచి ఫలితాలు ఆశిస్తాం, అడగకూడదు అంటే ఎలా.

 

Janasena-Kakinada-meeting-5.jpg

ప్రజా సంపదను ప్రజలకు ఇస్తూ చంద్రబాబు గారు తుఫాన్ సహాయం ఫోటోలో నవ్వడం ఏంటి, అది బాధ పడాల్సిన అంశం, సంతోషం ఏంటంటే అందులో లోకేష్ ఫోటో లేదు. నేను నిన్న అవినీతి మీద కోపం వచ్చి ఎవరైనా ఒక మాట అంటే దాని మీద చర్చలు పెట్టే టీవీ ఛానల్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎందుకు పెట్టడం లేదు అనే అంశం పై చర్యలు పెట్టవచ్చు కదా. మీ విలువైన సమయం కేటాయించి మీరు నాతో సమస్యలు చెప్పడానికి వచ్చారు అంటే ప్రభుత్వ వైఫల్యం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. జరుగుతున్న అక్రమ మైనింగ్ పై చర్చ పెట్టవచ్చు కదా ఎందుకు మీరు పనికిమాలిన అంశాలపై చర్చలు పెడుతున్నారు, మీకు బాధ్యత లేదా.

Janasena-Kakinada-meeting-6.jpg

 

కానీ సినిమాల్లో సమస్యలు పరిష్కరించడం సంతోషం కలిగించలేదు, అందుకే వైద్య సమస్యలపై బయటకు వచ్చి పోరాటం చేస్తున్నాను. మీరందరూ అండగా నిలబడడండి, జనసేన ప్రభుత్వం స్థాపిస్తుంది, కచ్చితంగా సమస్యలను పరిష్కరించి చూపుతాం. మరొకసారి మీ అందరి సలహాలు, సూచనలు తీసుకుని మ్యానిఫెస్టోలో వైద్య శాఖకు సంబంధించిన అంశాలను పొందుపరుస్తాం. జూనియర్ డాక్టర్లుకు  అండగా నిలబడేందుకు కొన్ని నెలల్లో ఒక ప్రణాళిక సిద్ధం చేసి నిర్ణయం తీసుకుంటాం. మీరు ఓటు వేయండి, ఓటు వేయకపోతే మీకు ప్రశ్నించే హక్కు ఉండదు. ఈసారి ఎన్నికల్లో అందరం ఓటు వేద్దాం ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ చేసే బాధ్యత లో భాగం అవుదాం. ముఖ్యమంత్రి గారికి అండగా మేము నిలబడితే ఈరోజు మీ సమస్యలు చెప్పుకోవడానికి వైద్య శాఖ మంత్రి లేకుండా చేశారు. 

 

Janasena-Kakinada-meeting-7.jpg

 

డాక్టర్లు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమైన రోజు మాత్రమే మీ సమస్యలకు చట్టసభల అండగా ఉంటాయి. వైద్యుల మీద దాడులు జరిగితే శాసనసభ్యులు బాధ్యత వహించాలి, అండగా ఉండాలి, ఇలా జరగాలంటే మీరు కూడా చట్టంలో భాగస్వామ్యులు కావాలి, మీరు కూడా ఎన్నికల వ్యవస్థలో భాగం కావాలి. జనసేన మీకు మాటిస్తుంది, మానిఫెస్టోలో పెడుతున్నాం, వైద్యులకు గృహ సముదాయాలు నిర్మిస్తాం, దీని ద్వారా మీరు మరింత మంచి వైద్య సదుపాయాలు కల్పించేలా కృషి చేస్తాం.

Advertisement

Share this content.