• కాకినాడ రురల్ మండలంలో పంచాయితీ పోరుకు యంత్రంగం సమాయత్తమైంది, ఎన్నికలకు అవసరం అయినా రేజర్వేషన్ల ప్రక్రియ కోసం పంచాయితీ ఓటర్ల జాబితాలో SC, ST, BC, ఇతర కులాల వారీగా ఓటర్లను గుర్తించే ప్రక్రియ ముగిసింది. ఆ మేరకు ఆయా గ్రామా పంచాయితీల్లో ముసాయిదా ఓటర్ల జాబితాలను అధికారులు విడుదల చేసారు. గత నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇంటింటి సర్వే జరిగింది. ఈ సర్వేలో ఓటర్ల జాబితాను కులాల వారీగా గుర్తించి వారి పేర్ల ఎదురుగా కులాలను ఓటర్ల జాబితాలో చేర్చారు.

  ఇదీ మండలంలో పరిస్థితి 

  కాకినాడ రురల్ మండల పరిధిలో 20 గ్రామాలుండగా వాటిలో రెండు గ్రామాలు ఎస్.అత్చ్యుతాపురం, స్వామి నగర్ సిటీ పరిధిలోకి వెళ్లాయి. మిగిలిన 18 గ్రామాలలో SC వర్గానికి చెందినవారు 14,794 మంది, ST  వర్గానికి చెందినవారు591 మంది, BC  వర్గానికి చెందినవారు 67,222 మంది, OC సామజిక వర్గానికి చెందినవారు 55,836 మంది ఉన్నారు. అన్ని వర్గాలకు చెందిన పురుషులు 69,237 మంది ఉండగా మహిళలు 69,203 మంది. ఇతరులు 10 మంది ఉన్నారు. కాకినాడ రురల్ మండలంలో ఓటర్లు సంఖ్య 1,38,450.

   

  గ్రామాల వారీగా కుల ప్రాతిపదికన జనాభా వివరాలు 

  పంచాయితీలు  SC  ST  BC  OC  స్త్రీలు  పురుషులు  ఇతరులు  మొత్తం 
  నేమం  429 11 2143 669 1648 1604 0 3252
  పండూరు  500 7 468 2872 1995 1847 2 3844
  పి.వెంకటాపురం  28 2 671 163 429 435 0 864
  పెనుమర్తి  617 0 551 176 675 669 0 1344
  తమ్మవరం  56 127 9 1762 1440 1257 0 2697
  తిమ్మాపురం  1114 103 1567 3982 3345 3419 0 6764
  సూర్యారావుపేట  20 4 4121 84 2134 2094 0 4228
  వాకలపూడి  1793 48 5143 4852 5923 5913 3 11839
  వలసపాకల  131 0 3501 5144 4414 4362 1 8777
  రమణయ్యపేట  3010 156 12994 10068 12900 13328 1 26229
  సర్పవరం  1508 6 4193 6268 6109 5866 1 11967
  ఇంద్రపాలెం  1209 57 8040 3357 6292 6371 0 12663
  చీడిగ  589 12 3664 1594 2925 2934 1 5860
  గంగానపల్లి  793 5 947 2637 2209 2173 0 4382
  కొవ్వాడ  666 8 1586 2371 2306 2325 0 4631
  రేవూరు  88 6 422 1755 1166 1104 0 2271
  కొవ్వూరు  901 89 2291 2754 3039 2996 1 6036
  తూరంగి  1508 6 4193 6268 6109 5866 0 11967