• జిల్లాలో పంచాయతీల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మరో కీలక ఘట్టం పూర్తయింది. ఈ ఎన్నికల నిర్వహణలో కీలక భూమిక పోషించే తుది ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రక్రియను మంగళవారం నిర్వహించారు. జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యాలయాల్లో తుది ఓటర్ల జాబితాలను ప్రచురించారు. గత ఏడాది ఆగస్టు ఒకటో తేదీతో పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం పూర్తయింది. అప్పటి కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వాటి పరిధిలో కులాల వారీగా ఓటర్ల తుది జాబితాను మంగళవారం అధికారులు ప్రకటించారు. నగర, పురపాలక సంఘాల్లో రిజర్వేషన్ల ప్రకారం డివిజన్లు, వార్డులను కేటాయించాలంటే కుల గణన తప్పని సరి. ఈమేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గణనను చేపట్టారు.ఈ జాబితాలను ఈ నెల 4వ తేదీన ప్రకటించగా వీటిపై ప్రజాభిప్రాయ సేకరణకు కొంత గడువు ఇచ్చారు. ఈమేరకు అందిన అభ్యంతరాలపై పునఃపరిశీలించి మంగళవారం తుది జాబితాలను ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలో నగర, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల సంఖ్యా వివరాలిలా ఉన్నాయి.

  నగర, పురపాలక సంఘం, నగర పంచాయితీ  SC  ST  BC  ఇతరులు 
  రాజమహేంద్రవరం  690 38,841 1,57,994 1,03,021
  అమలాపురం  426 5106 14,240 19,847
  తుని  96 6913 17,703 15,700
  పిఠాపురం  229 7646 14,403 20,284
  సామర్లకోట  416 7540 13,360 18,749
  మండపేట  252 4910 24,614 17,083
  రామచంద్రాపురం  274 4468 15,191 13,971
  పెద్దాపురం  376 3116 25,133 10,868
  ఏలేశ్వరం  659 4778 11,261 2,381
  గొల్లప్రోలు  58 2,615 4,490 13,538
  ముమ్మిడివరం  144 5140 9785 4,991