• పక్షుల్లా గాల్లోకి మనుషులు ఎగరడం.. ప్యారాసూట్ సాయంతో మనిషి గాల్లో ఎగరడం చూశాం. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ గాల్లోకి ఎగురుతూ దూసుకెళ్లడం.. సినిమాల్లోనే చూసి ఉంటాం. రియల్ గా ఎప్పుడూ చూసి ఉండరు. ఇప్పుడు నిజంగానే మనిషి గాల్లోకి ఎగిరే మనిషి వచ్చేసింది. అదే రియల్ ఐరన్ సూట్. ఈ సూట్ ధరిస్తే చాలు.. మనిషి అమాంతం గాల్లోకి ఎగురుతాడు. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లా గాల్లో, నీటిపై ఎగరవచ్చు.

    ఐరన్ సూట్ ధరిస్తే.. కనీసం 15 అడుగుల వరకు మనిషి ఎగురగలడు. రియల్ ఐరన్ సూట్ ను టోనీ స్టార్క్ అనే వ్యక్తి డిజైన్ చేశాడు. ఐరన్ సూట్ ధరించగానే గ్రౌండ్ లెవల్ నుంచి 4.5 మీటర్ల వరకు గాల్లో ఎగిరిపోవచ్చు. చూడటానికి అంతరిక్షంలో విహరించిన ఫీల్ వస్తుందని డిజైన్ చేసిన టోనీ తెలిపాడు. 

    రియల్ ఐరన్ సూట్ ను 3D ఫ్రింటెడ్ టైటానియంతో తయారుచేశారు. స్యూట్‌ పైభాగంలో సిల్వర్ పూత తో మెరిసిపోతుంది. ఈ సూట్లో 5 మినీ జెట్ ఇంజిన్లలో వెయ్యి హార్స్ పవర్ సామర్థ్యాన్ని ఫిట్ అయ్యేలా డిజైన్ చేశారు. సూట్ లోని ఇతరభాగాల్లో రిథేన్, పైబర్ గ్లాస్, 3D ఫ్రింటెడ్ నైలాన్ ను వాడారు. హైపర్ బోల్ లా సౌండింగ్ వస్తుంది.  ఐరన్ మ్యాన్ సూట్ ను డిజైన్ చేస్తున్నట్టు స్టార్క్ తెలిపాడు.

    ఈ సూట్ లో ఎలాంటి టెక్నాలజీని వాడారనేది కచ్చితమైన సమాచారం లేదు. ఐరన్ సూట్ డిజైన్ చేసిన అనంతరం టెస్ట్ డ్రైవ్ చేసినట్టు టోనీ తెలిపాడు. తన జీవితం మొత్తంలో 1000 హార్స్ పవర్ల శక్తి సామర్థ్యాన్ని వాడలేదని, చూడటానికి ఇది ఎంతో ఫన్నీగా ఉందని అన్నాడు. రియల్ ఐరన్ మ్యాన్ సూట్ తో వ్యక్తి పైకి ఎగురుతున్న వీడియోను చూడాలంటే..