You are here

Register for CM Awards - cmawards.ap.gov.in

Collector Kartikeya Mishra said "Register for CM Awards for Excellence in public administration before 19-07-2018. The Districts, Government agencies, Teams and Employees that specialize in the implementation of government schemes can apply through http://cmawards.ap.gov.in/ website. CM Nara Chandrababu Naidu will give these awards on 15th August 2018. For more details can call 0863-2441526, 08919760285 or email to [email protected].

 

 

cm-awards.jpg

 

CM అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం 

2017 - 18 సంవత్సరానికి ప్రభుత్వ పథకాల అమలులో విశేషకృషి చేసిన జిల్లాలు, ప్రభుత్వ సంస్థలు, టీములు, ఉద్యోగులకు ఇచ్చే సీఎం అవార్డ్స్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కొరకు ఈ నెల 19వ తేదీ లోపు దరఖాస్తు చేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఒక ప్రకటనలో కోరారు.

 

1.4.2017 నుండి 31.3.2018 వరకు గల కాలానికి ప్రధానం చేసే అవార్డులు రెండు విభాగాలలో ఉంటాయని వచ్చే ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విజేతలకు అందజేస్తారన్నారు.

 

జిల్లాలకు ఇచ్చే మొదటి కేటగిరీ అవార్డులు బహిరంగ మల విసర్జన రహిత ఆవాసాల సాధన, అందరికీ గృహాలు పథకం క్రింద అర్బన్, రూరల్ గృహాల నిర్మాణం, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రేసల్, ఈ గవర్నెన్స్ అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం అంశాలలో అందజేస్తారన్నారు.

 

ప్రభుత్వ పథకాలను విశిష్ట వినూత్న శైలిలో అమలు చేసినందుకు రెండో కేటగిరీ కింద రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తులు, బృందాలు సంస్థలకు మొత్తం 25 అవార్డుల అందజేయడం జరుగుతుందని తెలిపారు. క్యాటగిరి 2 అవార్డుల కొరకు వ్యక్తులు, సంస్థలు http://cmawards.ap.gov.in/ పోర్టల్ ద్వారా ఈ నెల 19వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. అలాగే ఈ అవార్డులకు సంబంధించి ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ నెంబర్లు 0863-2441526, 08919760285 లేదా ఇమెయిల్ ఐడి  [email protected] ద్వారా సంప్రదించవచ్చునని ఆయన తెలిపారు.

Advertisement

Share this content.