You are here

Sarkar National Level Tennis Quarter Finals Ended at Rangaraya Medical College Kakinada

Sarkar National Level Tennis Quarter Finals Ended at Rangaraya Medical College Kakinada

 

 

 

 

 

 

 

టెన్నిస్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉందని, వేగవంతమైన ఆటగా ప్రాచుర్యం పొందిందని గోదావరి టెన్నిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ జి.శేషగిరిరావు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ టెన్నిస్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఇక్కడి రంగరాయ వైద్య కళాశాలలో సర్కార్‌ జాతీయస్థాయి టెన్నిస్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌ పోటాపోటీగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతిమణికట్టు, మజిల్‌ పవర్‌తో బలమైన షాట్‌లు కొట్టడం ఈ ఆటలో ప్రత్యేకమన్నారు. టెన్నిస్‌ క్రీడాకారులు ఇక్కడికి వచ్చి ఆడడంతో కాకినాడకు జాతీయస్థాయి గుర్తింపు వస్తుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా ఉన్నప్పుడు జాతీయ స్థాయి టోర్నమెంట్‌ నిర్వహణ గ్రాఫ్‌లో 60వ స్థానమని, రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర కార్యదర్శి పీవీ రామ్‌కుమార్‌ ఆధ్వర్యంలో జాతీయస్థాయి టోర్నమెంట్‌ నిర్వహణ గ్రాఫ్‌లో ఏపీ 13వ స్థానానికి చేరిందన్నారు. ఈ పోటీలను టోర్నమెంట్‌ నిర్వాహకులు రామ్‌కుమార్, ఆర్‌ఎంసీ పీడీ స్పర్జన్‌రాజు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ టెన్నిస్‌ క్రీడాకారులు పద్మరాజు, డాక్టర్‌ రవి, ప్రేమ్‌స్వరూప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Share this content.