You are here

Shilparamam Will Come Soon into availability at Kakinada Beach

Shilparamam Will Come Soon into availability at Kakinada Beach

 

 

 

 

కాకినాడ సముద్రతీరంలో సుమారు రూ.మూడు కోట్లతో నిర్మిస్తున్న శిల్పారామం పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర శిల్పారామం ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌, కల్చరల్‌ సొసైటీ జనరల్‌ మేనేజర్‌ పి.బక్తర్‌ తెలిపారు. కాకినాడ గ్రామీణంలోని సూర్యారావుపేటలో ఎన్టీఆర్‌ బీచ్‌లో జరుగుతున్న పనులను ఈఈ కె.గురుప్రసాద్‌తో కలిసి ఆయన పరిశీలించి తగిన సూచనలిచ్చారు. మొదటి దశలో  చేనేత, జౌళి ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకానికి 25 స్టాళ్లను ఏర్పాటు చేశామన్నారు. రెండో దశలో అతిథి గృహాలు, జల క్రీడలు, కన్వెన్షన్‌ హాల్‌ తదితర సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామన్నారు. కేంద్రం రూ.1.70 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.30 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హ్యాండీక్రాఫ్ట్స్‌ ప్రమోషన్‌ అధికారి డి.పార్థసారథి, రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Share this content.